లగడపాటి ఇరుక్కున్నాడా ...? టీఆర్ఎస్ కక్ష తీర్చుకోబోతోందా ..?

ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు… ఎక్కడ లేని హడావుడి చేస్తూ….సర్వేల పేరుతో….

 Kcr Focusing On Lagadapati Rajagopal In Telangana-TeluguStop.com

ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చెబుతూ సమీకరణాలు మార్చడంలో దిట్టగా పేరు పడ్డ లగడపాటి రాజగోపాల్ క్రెడిట్ అంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే మాయం అయ్యింది.దీంతో ఇప్పుడు రాజగోపాల్ హవా తగ్గిపోయింది.

అక్టోఫస్ అనే ఆ బిరుదు కూడా… ఇప్పుడు పోయింది.తెలంగాణాలో ఎన్నికల్లో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడమే దీనికి ముఖ్య కారణం.

అంతే కాకుండా … టీడీపీ తో ఉన్న లాలూచి కారణంగా…తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుంది అంటూ పోలింగ్ కి ముందు లగడపాటి ప్రకటించి సంచలనం సృష్టించాడు.ఆ వ్యాఖ్యలతో ఒకదశలో టీఆర్ఎస్ కూడా…చాలా ఆందోళన చెందింది.

లగడపాటి చెప్పింది నిజమేనా అనే సందేహం అందరిలోనూ… వ్యక్తం అయ్యింది.

చంద్రబాబు కనుసన్నల్లోనే లగడపాటి సర్వేల పేరుతో జోస్యాలు చెప్పారన్న ఆరోపణ ఉంది.ఈ జోస్యం కారణంగా….చాలామంది కోట్లాది రూపాయలను, ఆస్తులను బెట్టింగ్‌లో పెట్టి చాలా దెబ్బతిన్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మహాకూటమే గెలుస్తుందని చెప్పిన లగడపాటి.అసలు ఫలితాల తర్వాత మీడియా ముందుకు రాలేదు.

దీంతో లగడపాటిపై అనేక అనుమానులు, ఆరోపణలు వచ్చాయి.జనాన్ని తప్పుదోవ పట్టించి, ఫలితాలను తారు మారు చేసేందుకు లగడపాటి కుట్ర చేశారన్న ఆరోపణ బలంగా ఉంది.

ఈ సందర్భంలోనే… టీఆర్ఎస్ మరో ముందు అడుగు వేసి….లగడపాటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ నేత సత్తు వెంకటరమణా రెడ్డి.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ను కలిసి లగడపాటిపై చర్యలు తీసుకోవాలి అంటూ… ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాస్తవంగా… ఎన్నికలకు ముందు ఎటువంటి సర్వే ఫలితాలు బయటకి విడుదల చేయకూడదు అంటూ… ఎన్నికల కమిషన్‌ నింబధనలు ఉన్నప్పటికీ లగడపాటి మాత్రం కొంతమంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారు అంటూ… పేర్లతో సహా చెప్పి నిబంధనలు అతిక్రమించారని… ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే లగడపాటి చెప్పిన సర్వేలు అన్నీ నిజమేనేమో అని నమ్మి ఎంతో మంది బెట్టింగ్‌లు కాసి భారీగా నష్టపోయారని వివరించారు.ఇలాంటి తప్పుడు సర్వే ఫలితాలను వెల్లడించే వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎన్నికల ప్రక్రియే అపహాస్యం అయ్యే ప్రమాదం ఉందని టీఆర్‌ఎస్‌ నేత ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఏవిధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.

అలాగే లగడపాటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube