ఢిల్లీ రాజకీయం పై కేసీఆర్ ఫోకస్ ? ఎంపీలకు కీలక సూచనలు 

ఢిల్లీ స్థాయిలో రాజకీయం వేడెక్కిస్తే తప్ప తెలంగాణలోనూ టిఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు రావు అనే విషయాన్ని టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించారు.అందుకే గత కొద్ది రోజులుగా పార్లమెంటులోనూ,  రాజ్యసభలోనూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తూ,  సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Kcr Focus On Delhi Politics Key Tips For Mps Kcr, Delhi, Trs, Telangana, Trs Mps-TeluguStop.com

  ముఖ్యంగా తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన కేంద్రం ను నిలదీస్తూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండడం , ఆ ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తూ ఉండటం, రైతులలోను బీజేపీ పై వ్యతిరేకత పెరుగుతూ ఉండడం ఇవన్నీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ ఎంపీలు ,మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో భారీ ధర్నా చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు .

    ఈ మేరకు ప్రగతి భవన్ లో పార్టీ ఎంపీలు , మంత్రులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు, శాసనమండలి , స్థానిక సంస్థల ఎన్నికల పైన కేసీఆర్ ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు పార్లమెంట్ లో నిరసన చేపట్టి టిఆర్ఎస్ గ్రాఫ్ మరింతగా పెంచిన ఎంపీ లను కేసీఆర్ అభినందించారు.ధాన్యం కొనుగోలు లో వార్షిక లక్ష్యం నిర్ణయించడం,  కనీస మద్దతు ధర చట్టం కోసం డిమాండ్ చేయడం ఇలా అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ఎంపీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని,  శాసన మండలి ఎన్నికలు ముగిసిన తర్వాత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలతో భారీ ధర్నా కార్యక్రమం చేపడతామని కేసీఆర్ ప్రతిపాదించారు.
 

Telugu Central, Delhi, Kcr Delhi, Rajyasabha, Telangana, Trs Mps-Telugu Politica

స్వయంగా తాను కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటానని, కేంద్రం తీరును ఢిల్లీ స్థాయిలోనే ఎండగడతామని పార్టీ ఎంపీలకు సమావేశంలో కెసిఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో ఢిల్లీ స్థాయిలో భారీ ధర్నా కార్యక్రమానికి దిగుతుండడం తో కేసీఆర్ బీజేపీ పై ఏ స్థాయిలో ఫోకస్ పెంచారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube