మీడియా పై కేసీఆర్ ఫైర్ ? శాపనార్థాలు

ముక్కు సూటిగా మాట్లాడుతూ తాను చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పగలగడం తెలంగాణ సీఎం కెసిఆర్ స్టైల్.ఏ విషయంలో అయినా, ఎంత పెద్ద స్థాయి వ్యక్తుల మీద అయినా కెసిఆర్ వ్యవహారం ఈ విధంగానే ఉంటుంది.

 Telangana, Cheif Minister, Kcr, Lock Down, April 14'th, Prime Minister, Social M-TeluguStop.com

తాజాగా కరోనా వైరస్ వ్యవహారంలోనూ కేసీఆర్ మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే బాగానే పని చేస్తున్నారనే ప్రశంసలు అందుకున్నారు.ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ, అందరూ అప్రమత్తం గా ఉండేలా చేస్తున్నారు.

దేశంలో ఎలా ఉన్నా తెలంగాణ లో అతి త్వరలోనే పూర్తిగా కరోనా ను కంట్రోల్ చేస్తామంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అలాగే ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ నిబంధన గడువు ఏప్రిల్ 14 తో ముగియనుండడంతో ఆ గడువు సరిపోదని, మరికొంతకాలం అంటే జూన్ 3వ తేదీ వరకు ఈ సమయాన్ని పెంచాలంటూ కేసీఆర్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై కొన్ని పత్రికలు ఛానళ్లు, అలాగే సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా కథనాలు ప్రచారం చేస్తుండడం పై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘ ఈ విపత్కర సమయంలో కొన్ని పత్రికలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి అని కేసీఆర్ అన్నారు.అలాంటి వాళ్ళు రాసే రాతలు పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.తెలంగాణలో 40 వేల పీ పీ పీ ఈ ఇట్లు అందుబాటులో ఉన్నాయని, అవి కాకుండా 5 లక్షల కిట్ల కోసం ఆర్డర్ పెట్టమని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

లోకం ఆగం అవుతుంటే చిల్లర వేషాలు వేయడం సరికాదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనుచితంగా ఎవరైనా వ్యవహరిస్తే సరైన సమయంలో సరైన శిక్ష వేస్తామని దుర్మార్గం వదిలిపెట్టమని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube