ఆంధ్ర ప్రాజెక్టులపై తొలిసారి ఫైర్ అయిన కేసీఆర్.. ఇక రణరంగమే‌నా?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపైన తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి తాజాగా స్పందించారు.

 Kcr Fired For The First Time On Andhra Projects .. Is It A Battlefield?,  Kcr, J-TeluguStop.com

ఏపీ సర్కారు తీరును దుయ్యబట్టారు.వారి తీరు ‘దాదాగిరి’ అని పేర్కొన్నారు.

నీటి పంచాయితీపై ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉన్న సీఎం కేసీఆర్ తాజాగా కేంద్రం వ్యతిరేక వైఖరి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ సీఎం ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరిగా ఒక వైపు ఏపీ సర్కారును, మరో వైపు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

కృష్ణా, గోదావరి నది బేసిన్‌లలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి నియంత్రణను ఆయా నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేస్తూ కేంద్రం ఇటీవల గెజిట్ జారీ చేసింది.తాజాగా ఈ గెజిట్‌పై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాగిరి చేస్తున్నదని, కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు కేసీఆర్.

కృష్ణా నీళ్ల మీద ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు.ఇదిలా ఉండగా మొదలు చర్చలు చేసుకోవాలని, చర్చల ద్వారానే ఎంతటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సూచించాడు.

ఈ క్రమంలోనే అవసరమైతే తాను రాజ్యాంగ పరిధిలో మధ్యవర్తిత్తవం వహిస్తానని కూడా సీజేఐ తెలిపారు.ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విధంగా స్పందించారు.

ఇక కౌంటర్ అటాక్‌గా ఏపీ సర్కారు నుంచి ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కామెంట్స్ చేశారు.

Telugu Krishna, Ap Poltics, Central, Cm Kcr, Jagan, Srishilam, Ts Poltics-Telugu

తెలంగాణ సర్కారు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి 30 టీఎంసీల వాటర్‌ను అనవసరంగా సముద్రం పాలు చేసిందని ఆయన ఆరోపించారు.ఎలాగూ ఎగువ ప్రాంతంలో ఉన్నామనే తెలంగాణ సర్కారు ఉద్దేశ పూర్వకంగా జల వివాదాన్ని సృష్టించిందని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాటాను కాపాడుకోవడానికే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని సజ్జల వివరించారు.

మొత్తంగా జలవివాదం రోజురోజుకూ ఇంకా బాగా ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యతగా చర్చలు జరుపుకుని, తద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు కొందరు మేధావులు సూచనలూ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube