కిషన్ రెడ్డిపై కెసీఆర్ ఫైర్...ఈ రగడకు ముగింపు ఎప్పుడు?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై పెద్ద ఎత్తున బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.గత కొన్ని రోజులుగా చల్లబడిందనుకున్నా నేటి కెసీఆర్ ప్రెస్ మీట్ తో మరల నిప్పు చెలరేగిన పరిస్థితి ఉంది.

 Kcr Fire On Kishan Reddy ... When Will This Ragada End Telangana Politics, Kisha-TeluguStop.com

అయితే తాజాగా కిషన్ రెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కెసీఆర్ పై పెద్ద ఎత్తున విరుచుక పడ్డ సంగతి తెలిసిందే.కెసీఆర్ మొండి పట్టుతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నాడని తక్షణమే రైతుల వరి ధాన్యాన్ని మొత్తం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కెసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.కిషన్ రెడ్డి నీకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో రైతుల బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయించాలని లేకుంటే మాట్లాడే దమ్ము లేదని రైతులకు క్షమాపణలు చెప్పాలని కెసీఆర్ ఫైర్ అయ్యారు.

తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీలో పట్టించుకునే వారే ఉండరని ఇక్కడ భారీ ప్రకటనలు చేస్తారని కెసీఆర్ మండి పడ్డారు.అయితే టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఈ వరి ధాన్యం కొనుగోలు రగడ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ సమస్యకు ముగింపు ఎప్పుడు పలుకుతుందనేది చెప్పలేని పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, Bjp, Etala Rajrnder, Formmers, Kishan Reddy, Paddy, Telangana, T

వరి ధాన్యం విషయంలో కెసీఆర్ ఎంచుకున్న వ్యూహంతో తెలంగాణ రైతులు అంగీకరించే అవకాశం ఎక్కువ.తద్వారా బీజేపీ రాజకీయం చేయాలని భావించిన కీలక అంశం కాస్తా బీజేపీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.అయితే రాజకీయంగా టీఆర్ఎస్ ను భూ స్థాపితం చేయాలని భావిస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ తో రణరంగం జరిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మరి ఈ రగడకు ముగింపు ఎప్పుడు పడుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube