కేసీఆర్ ఢిల్లీ టూర్ వెన‌క ఆ భ‌య‌మే కార‌ణ‌మా...!

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి.కొద్ది రోజులుగా అక్క‌డ కారు పార్టీ జోరుకు వ‌రుస‌గా బ్రేకులు ప‌డుతోన్న ప‌రిస్థితి.

 Kcr Feared And Went To Delhi Tour, Kcr, Telangana Cm, Delhi Tour, Trs, Elections-TeluguStop.com

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కేసీఆర్‌ను గ‌ద్దె దింపి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.ఇప్ప‌టికే అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌ను పూర్తీగా నిర్వీర్యం చేయ‌డంతో పాటు ఆ పార్టీ స్థానాన్ని మూడో ప్లేస్‌కు నెట్టి వేసి.

రెండో ప్లేస్‌లోకి వ‌చ్చేందుకు బీజేపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది.ఇప్ప‌టికే దుబ్బాక విజ‌యం సాధించిన బీజేపీ అక్క‌డ కాంగ్రెస్‌కు డిపాజిట్ ‌లేకుండా ఏకంగా మూడో స్థానానికి నెట్టి వేసింది.

ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కే కాకుండా అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు దిమ్మ‌తిరిగి పోయే షాక్ బీజేపీ ఇచ్చింది.కాంగ్రెస్‌ను పూర్తిగా నాశ‌నం చేసిన బీజేపీ ఏకంగా 48 కార్పొరేట‌ర్ సీట్ల‌తో టీఆర్ఎస్‌కు అతి స‌మీపంలోకి వెళ్లిపోయింది.

ఇదే ఉత్సాహంతో బీజేపీ ఇప్పుడు అక్క‌డ నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించాల‌ని ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు దూసుకు పోతోంది.ఈ ప‌రిణామాలు అన్ని కేసీఆర్‌లో తీవ్ర  భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తున్నాయ‌న్న ప్ర‌చారం అయితే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

Telugu Bjp Mim, Congress, Delhi, Dubbaka, Ghmc, Sketch, Telangana Cm-Telugu Poli

ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్ ర‌హ‌స్యంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం కూడా అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది.ప్ర‌తిప‌క్షాల నేత‌లు సైతం దీనిపై అనేక అనుమానాల‌తో పాటు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి? అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి ప్రశ్నించారు.కేసీఆర్ సీబీఐ, ఈడీ కేసుల‌కు భ‌య‌ప‌డే ర‌హ‌స్యంగా ఢిల్లీ వెళుతున్నారా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కుట్రలు ప‌న్నుతున్నాయన్న ఆయ‌న మ‌తం పేరుతో యువ‌తను రెచ్చ‌గొట్టే పార్టీల‌కు వారు దూరంగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube