కేసీఆర్ కి అంత భయం ఎందుకు ...? ఆ సర్వేలను నమ్మేస్తున్నాడా ...?

తెలంగాణాలో సర్వేల రిపోర్ట్ ల ఫలితాలు రాజకీయ నాయకులకు నిద్రపట్టనివ్వడంలేదు.అనుకూల ఫలితాలు వస్తున్న పార్టీలు ఈ ఫలితాలపై నోరుమెదపడం లేదు.

 Kcr Fear About Lagadapati Surveys-TeluguStop.com

కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చిన పార్టీలకు ఈ పరిణామాలు మింగుడుపడడంలేదు.ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చాలా ఆగ్రహం తెప్పిస్తున్నాయి.అందుకే… కొంత మంది సన్నాసులు.తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు శాపాలు పెట్టారు.

ఇప్పుడు వెకిలి, మకిలి, పిచ్చి సర్వేలు విడుదల చేస్తారు.వాటిని పట్టించుకోవద్దు అంటూ… శుక్రవారం ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ ఘాటుగా మాట్లాడారు.

వాస్తవంగా లగడపాటి సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రాకపోయినా కేసీఆర్ మాత్రం అసహనంతో రగిలిపోతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది నుంచి పది మంది వరకూ గెలుస్తారని.వారి పేర్లు రోజుకు రెండు చొప్పున విడుదల చేస్తానని ప్రకటించారు.పూర్తి స్థాయి సర్వే ఫలితాలు మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత విడుదల చేస్తానని స్పష్టంగా చెప్పారు.

అయినప్పటికీ.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

లగడపాటి విడుదల చేయబోయే సర్వే ఫలితాలు.టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయానికి వచ్చేసారు.

అందుకే మరో ముందడుగు వేసి మరీ లగడపాటి పై ఎన్నికల కమిషన్ కి పార్టీ నాయకులతో ఫిర్యాదు కూడా చేయించారు.

లగడపాటి ప్రకటించబోయే.సర్వే ఫలితాలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉంటుందని ఎలా ముందుగానే ఊహించేశారో ఎవరికీ అర్ధం కావడంలేదు.కానీ… లగడపాటి సర్వే ఫలితాలు అంతే అందరికి ఒక బలమైన నమ్మకం.ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా చెప్తారని ఒకరకమైన నమ్మకం అందరికి ఉంది.గతంలో టీఆర్ఎస్‌కు అనుకూలంగా కూడా ఆయన సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

తాజాగా వెలువడిన కొన్ని సర్వేల్లో మహాకూటమి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఫలితాలు వచ్చాయి.మహాకూటమికి సుమారు 65 నుంచి 70 సీట్లు వస్తాయని సగటున అంచనా వేస్తున్నాయి.

ఈ దశలో కేసీఆర్ చేయించిన ఫలితాలు కూడా దాదాపు ఇదే రకంగా వచ్చి ఉంటాయని .అందుకే ఆయన అంత అసహనంగా కనిపిస్తున్నారని టీఆర్ఎస్ లోనే చర్చ నడుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube