తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమైన కేసీఆర్.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. !?

గత పదిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీని వీడిన చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో తన వెనుక మూడేళ్లుగా కేసీఆర్ వెంట పడితే టీఆర్‌ఎస్‌లో చేరానని వ్యాఖ్యానించారు.

 Kcr Failed To Develop Telangana Former Mp Sensational Comments Telangana, Cm Kc-TeluguStop.com

అయితే తాను అనుకున్నంతగా తెలంగాణను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారని, ఫలితంగా తెలంగాణ ఆర్థికంగా వెనక్కిపోయిందని, కాగ్ నివేదిక కూడా ఇదే బయటపెట్టిందని కొండా విమర్శించారు.

ఇకపోతే టీయార్ఎస్‌కు కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం కాదన్నారు.

తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ రీజినల్ పార్టీలు ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్ కే లాభమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలే విలన్లుగామారారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు రాజీనామాచేసినట్లు ప్రకటించిన కొండా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు.కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన అనంతరం కొత్త పార్టీపై ఆలోచన చేస్తానని వెల్లడించారు.

అదీగాక కొండాకు బీజేపీ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.మరి ఈయన బీజేపీలో చేరతారా?లేదా కొత్త పార్టీ పెడతారా? అనేది సస్పెన్షన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube