చంద్రబాబు రాజకీయ చతురత ముందు తేలిపోయిన కేసీఆర్  

చంద్రబాబు స్ట్రాటజీ ముందు ఫెయిల్ అయిన కేసీఆర్..

Kcr Fail In Chandrababu Political Strategy-kcr Fail,national Politics,tdp,trs

ఏపీ రాజకీయాలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత దేశ రాజకీయాలలో కూడా అపర చానిక్యుడు అనే గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఎలాంటి సమయంలో అయిన తనకి అనుకూలంగా మార్చుకొని ఎప్పుడు ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేస్తే ఫలితం తనకి అనుకూలంగా మార్చుకోవడంలో ఉద్దండుడు అని చెప్పాలి. అలాంటి చంద్రబాబు దగ్గర రాజకీయం మొదలెట్టిన వ్యక్తి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే విషయం అందరికి తెలిసిందే..

చంద్రబాబు రాజకీయ చతురత ముందు తేలిపోయిన కేసీఆర్-KCR Fail In Chandrababu Political Strategy

అయితే ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని అతనిని రాజకీయంగా అణగదొక్కడానికి కేసీఆర్ వేసిన వ్యూహాలు తేలిపోతున్నాయి అనే టాక్ ఇప్పుడు రాజకీయాలలో వినిపిస్తుంది. టీడీపీ అధినేత దేశ రాజకీయాలలో మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలని దగ్గర చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు అభిప్రాయం ప్రకారమే ఇప్పుడు కేంద్రంలలో మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు పని చేస్తున్నారు.

అయితే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిగా ప్రాంతీయ పార్టీలని ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న ఇతర పార్టీ అధినేతలని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్న వారి నుంచి కేసీఆర్ కి సహకారం అందడం లేదని టాక్ వినిపిస్తుంది. కేసీఆర్, చంద్రబాబు వ్యూహాల ముందు తేలిపోతున్నారని రాజకీయ వర్గాలలో చెప్పుకుంటున్నారు.