రోహిత్ కేసు : కెసిఆర్ కావాలనే తప్పించుకున్నారు !

నిన్న స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే, పార్లమెంట్ లో ఒకరకమైన శివతాండవం చేసారు ఆమె.టీవీ లలో , ఇంటర్నెట్ లో ఆమె స్పీచ్ చూస్తే అందులో ఒక ముఖ్య విషయం – తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విషయం అర్ధం అవుతోంది.

 Kcr Escaped From Rohith Case-TeluguStop.com

ఆమె తన స్పీచ్ లో రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో పరిణామాల గురించి వివరణ ఇస్తూ రోహిత్ చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే శాంతి భద్రతల విషయంలో సహకారం కోసం కెసిఆర్ కి ఫోన్ చేసాను అని అన్నారు ” సార్ బిజీ గా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడలేరు అని సమాధానం నాకు ఒచ్చింది ” అన్నారు ఆమె.వెంటనే ఆయన కుమార్తె కవితకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు.ఆయన మళ్ళీ ఫోన్ చేస్తారనే ఉద్దేశ్యంతో వేచి చూశానని, ఇప్పటికీ ఆయననుంచి ఫోన్ రాలేదని చెప్పారు.అయినా కూడా ఇప్పటివరకు ఆ విషయం బయటకు చెప్పలేదని అన్నారు.

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి జోక్యం చేసుకుని, కేసీఆర్‌కు స్మృతి ఇరానీ ఫోన్ చేసినప్పుడు తాను అక్కడే(కేసీఆర్ ఇంటివద్దే) ఉన్నానని చెప్పారు.దీనిపై ముఖ్యమంత్రి వెంటనే ఇంటలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు.15 నిమిషాల తర్వాత శివధర్ రెడ్డి తిరిగి ఫోన్ చేసి అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నట్లు చెప్పారని వెల్లడించారు.పరిస్థితి అదుపులోకి రావాలంటే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఐజీ చెప్పినట్లు జితేందర్ రెడ్డి చెప్పారు.

ఇదే విషయాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించినట్లు తెలిపారు.ఈ విషయంలో తాము పూర్తిగా సహకరించామని, తమపై ఆరోపణలు చేయలేరని జితేందర్ అన్నారు.కేసీఆర్ తగిన విధంగా స్పందించారని, పైగా అప్పట్లో తాము జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడిలో ఉన్నామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube