మంత్రివర్గ విస్తరణ పై కేసీఆర్ దృష్టి ? ఎవరెవరికి ఛాన్స్ ? 

త్వరలోనే తెలంగాణ  సీఎం కేసీఆర్ తను మంత్రిమండలిని ప్రక్షాళన చేసే విషయంపై దృష్టి సారించారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేద్దామని చూసినా,  ఆ ప్రయత్నాలు అమలు కాలేదు.

 Kcr, Telangana, Trs, Trs Mlcs, Telangana Cabinet, Etela Rajendar,-TeluguStop.com

ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఆ శాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు పూర్తి స్థాయిలో అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయలేదు.అయితే ఇప్పుడు తను మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు కలిసొచ్చేలా చేసుకోవాలనే ప్లాన్ లో కెసిఆర్ ఉన్నారట.

అయితే కేసీఆర్ ప్రాప్తి ఎవరెవరికి ఉంది , మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అనే  ఉత్కంఠ అందరిలోనూ ఉంది.మంత్రుల్లో ఎవరో ఒకరికి పదవీగండం ఏర్పడబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం వుండగానే,  వరంగల్ కు చెందిన బండా ప్రకాష్ కు ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

Telugu Etela Rajendar, Telangana, Trs Mlcs-Telugu Political News

ఇప్పుడు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో , ఆయనకు ఈటెల రాజేందర్ కు కేటాయించిన శాఖలు కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది.ఉప ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన కడియం  శ్రీహరి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి , ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న కేసీఆర్ సన్నిహితుడు వెంకట్రామిరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించబో తున్నారట.అలాగే నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు .ఆయనకు కనుక అవకాశం కల్పిస్తే మండలి చైర్మన్ గా నియమించే అవకాశం ఉంది.వీరి సంగతి ఇలా ఉంటే , ప్రస్తుత సిట్టింగ్ మంత్రులలో చాలామంది ని తప్పించి వారి స్థానంలో సమర్ధులైన వారికి అవకాశం కల్పించాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.

 ఇప్పటికే మంత్రుల పనితీరుపై శాఖల వారీగా నివేదికలు తెప్పించుకున్న కెసిఆర్ క్షేత్రస్థాయిలో వారి బలం బలగం, వంటి వ్యవహారాలు అన్నింటిపైనా నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు కలిసి వస్తారు అనుకునే వారిని ప్రస్తుత మంత్రి మండలి కొనసాగించి , మిగతా వారిని తప్పించాలని కేసీఆర్ చూస్తున్నట్టు తెలుస్తోంది.

అతి త్వరలోనే మంత్రిమండలి ప్రక్షాళన కెసిఆర్ చేయబోతున్నారనే వార్తలతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు మంత్రి పదవులు దక్కించుకునేందుకు వివిధ మార్గాలు ప్రయత్నాలు మొదలు పెట్టరట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube