అక్కడ బాబు చేసిన తప్పే ... ఇక్కడ కేసీఆర్ కూడా చేస్తున్నాడా ...?

తెలంగాణ లో ఏపీ సీఎం చేసిన తప్పే ఇప్పడు ఏపీలో తెలంగాణ సీఎం చేస్తున్నాడా …? అసలు ఆ రెండు విషయాలకు పొంతన ఎక్కడ కుదిరింది.? ఈ ఇద్దరు చంద్రులు చేసిన… చేయబోతున్న తప్పులు ఏంటి.? అనే విషయం గురించి ఒకసారి క్లారిటీ తెలుసుకుందాం ! మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.అయితే… పోలింగ్ కి ముందు పరిస్థితి వేరు.మహాకూటమి కి దాదాపు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతా భావించారు.అయితే ఫలితం మాత్రం తారుమారు అయ్యింది.చివరి నిముషం వరకు పొత్తులు, సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, చంద్రబాబు మితిమీరిన ప్రచారం వల్ల టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసివచ్చింది.మహాకూటమి అధికారంలోకి వస్తే … తెలంగాణాలో చంద్రబాబు పెత్తనం అంటే ఆంధ్రా పెత్తనం పెరిగిపోతుందని… మన రాష్టాన్ని మనమే పాలించుకుందామని టీఆర్ఎస్ రగిల్చిన వేడి బాగా వర్కవుట్ అయ్యింది.

 Kcr Doing Same Mistake As Chandrababu Naidu In Ap-TeluguStop.com

ఫలితంగా అధికారం లోకి రావడం ఖాయం అనుకున్న కూటమి కుదేలయ్యింది.అయితే తెలంగాణాలో చంద్రబాబు ఏదైతే తప్పు చేసాడో సరిగ్గా అదే తప్పు ఇప్పడు కేసీఆర్ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఆంధ్ర వారికి తెలంగాణలో పనేంటి అని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి చంద్రబాబు భరతం పట్టడానికి సిద్ధం అయ్యింది.ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకులను ఏపీకి పంపేసింది టీఆర్ఎస్.

ఆంధ్ర వెళ్ళి అక్కడి ప్రభుత్వం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యడం, కేసీఆర్ ను ఇంప్రెస్స్ చెయ్యడానికి రోజుకు రెండు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిట్టడం వంటి పనులను తలసాని చాలా చక్కగా నిర్వర్తించాడు.అయితే టీఆర్ఎస్ చేస్తున్న ఈ ఎత్తుగడ మరీ ఓవర్ గా కనిపిస్తోంది.

ఇప్పుడు వైసీపీ టీఆర్ఎస్ తో చేతులుకలపడాన్ని టీడీపీ రాజకీయంగా వాడేసుకోవాలని చూస్తోంది.అందుకే ఆంధ్ర సెంటిమెంట్ రేకెత్తించే పనిలో పడ్డారు టీడీపీ నాయకులు.అసలు ఇందులో వైసీపీ టీఆర్ఎస్ రెండూ తప్పు చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి.అసలు వైసీపీ – టీఆర్ఎస్ బహిరంగంగా చేతులు కలపడం కూడా తప్పే.తెర వెనుక ఉండి చెయ్యాల్సిన సాయం చేస్తే పని జరిగిపోతుంది.కానీ ఇలా ఏపీ కి వచ్చి మరీ చంద్రబాబు ని తిట్టడం వల్ల టీడీపీ పై సానుభూతి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

వైసీపీ, జనసేన, బీజేపీ టీఆర్ఎస్ ఇలా అంతా బాబుని ఒక్కడిని చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే … దీన్ని టీడీపీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే…? అది వైసీపీకి మైనెస్… టీడీపీ కి ప్లస్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube