ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తున్న కేసీఆర్... ఎలాగంటే?

రాజకీయ అపరచాణక్యుడిగా కేసీఆర్ కు రాజకీయ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది.తన రాజకీయ పరిణతితో అసాధ్యమనుకున్న తెలంగాణను తన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో అన్ని రకాల వర్గాలను ఏకం చేసి సాధించి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమకారుడిగా విజయం సాధించాడు.

 Kcr Doing No Work For The Opposition   How, Kcr, Trs Party , Kcr, Trs Party-TeluguStop.com

అయితే తెలంగాణ ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంటివి మనకు తెలిసిందే.అయితే ప్రభుత్వం ని ఇప్పటికీ రెండో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తనకు తెలంగాణ రాజకీయాల్లో ఎదురు లేదనే విధంగా తయారయ్యాడు.

అయితే అందరికీ ఎప్పటికీ మంచి రోజులు ఉండవన్నట్టు కేసీఆర్ కు రకరకాల ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ కు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయని అందరూ భావించారు.

కాని అది తాత్కాలికమని తాజా పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతోంది.

ఎందుకంటే దుబ్బాక ఓటమి తో టీఆర్ఎస్ పనైపోయిందనుకున్న ప్రతిపక్షాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో ఒక్కసారిగా ఖంగు తిన్నాయి.అయితే తాజాగా ఇక ప్రైవేటు స్కూళ్ల టీచర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని గగ్గోలు పెట్టడంతో ఇక ఇదే అదునుగా ప్రతిపక్షాలు వీరిని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించాయి.

కాని కేసీఆర్ వారికి ఈ ఛాన్స్ ఇవ్వలేదు.ఒక్కో ప్రయివేట్ టీచర్ కు నెలకు రూ 2,500 నగదు, 25 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు పని లేకుండా చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube