సర్వేల మీద సర్వే ! ఇప్పుడు మరో సర్వే ? 

తమ పార్టీ పరిస్థితి, తమ నాయకత్వం పై ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏమిటి ? ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయా లేదా ? ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఇలా అనేక అంశాలపై రాజకీయ పార్టీలు సర్వే చేయించడం ఆనవాయితీగా వస్తోంది.సర్వే రిపోర్టుల్లో తేలిన అంశాలను పరిగణలోకి తీసుకుని,  దానికి అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలు రూపొందించుకుంటూ ఉంటారు.

 Kcr Doing Another Survey For Huzurabad By Elections, Kcr, Telangana, Hujurabad,-TeluguStop.com

ఇక ఈ విషయంలో అందరి కంటే ముందు ఉంటూ ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్.ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఆ ఫలితాలku అనుగుణంగా తన నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు.

ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలోనూ అదే విధమైన ఎత్తుగడతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పరిస్థితి ఏవిధంగా ఉంది అనే విషయంపై రెండు సార్లు సర్వే చేయించారు .ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ వీడి బిజెపి లో చేరిన తరువాత జనాల్లో జరుగుతున్న చర్చ ఏమిటి ?  బిజెపి ఎంతవరకు బలం పుంజుకుంటుంది ? టిఆర్ఎస్ కు ఏ ఏ అంశాలు ఇబ్బందికరంగా మారుతాయి అనే విషయం పై మొదటి సర్వే చేయించారు.అయితే ఈ సర్వేలు బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినా,  ఈటెల రాజేందర్ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, ఆయనపై సానుభూతి ఇవన్నీ ఆయన గెలుపును డిసైడ్ చేయబోతున్నట్టు తేలింది.

వెంటనే దళిత బందు పథకం కెసిఆర్ అమల్లోకి తీసుకువచ్చారు .
 

Telugu Dalitha Bandhu, Etela Rajendar, Gellusrinivas, Hujurabad, Huzurabad, Kcr

ఇక టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనూ ఇదే ఫార్ములాను ఉపయోగించారు .హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు పోటీపడ్డారు.వారిలో ఐదుగురు ని ఎంపిక చేసిన కెసిఆర్ వారిలో గెలుపు గుర్రం ఎవరు అనే విషయం పైన సర్వే చేయించగా,  గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయితే  ఫలితం అనుకూలంగా ఉంటుందనే సంకేతాలు రావడంతో,  రెండు నెలలకు ముందుగానే ఆయన పేరును ప్రకటించారు.

ఇక ఇప్పుడు చూస్తే హుజురాబాద్ లో అమలు చేస్తున్న దళిత బంధు పథకం కారణంగా బీసీల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది అని, తమకు అటువంటి పథకం ప్రవేశపెట్టాలనే డిమాండ్ పెరగడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతాయి అని గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు ఈ వ్యవహారాలపై మరో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube