ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేని కేసీఆర్.. అసలు వ్యూహం ఇదే

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడనే విషయం రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఎంతటి ఎవరోధాన్నైనా చక్కటి అవకాశంగా మల్చుకోగల సమర్తుడు కేసీఆర్.

 Kcr Does Not Care About The Opposition This Is The Real-TeluguStop.com

అందుకు ఆర్టీసీ సమ్మె ప్రత్యక్ష ఉదాహరణ.దాదాపు నెలరోజుల నుండి ఉద్యమం జరుగుతున్నా కేసీఆర్ స్పందించిన పరిస్థితి లేదు.

కనీసం ఆర్టీసీ సమ్మెపై ఎటువంటి సమీక్ష జరిపిన పరిస్థితి లేదు.ఒక్కసారిగా స్పందించి ఆర్టీసీ కార్గో విధానాన్ని తీసుకొచ్చి, ఫుల్ శాలరీ, బోనస్ ప్రకటించి ఏ ఆర్టీసీ కార్మికులైతే కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారో, వారి చేతితోనే పాలాభిషేకం చేసేలా తన వ్యూహాన్ని ప్రయోగించిన ఘనత కేసీఆర్ కు సొంతం.

 Kcr Does Not Care About The Opposition This Is The Real-ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేని కేసీఆర్… అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రతిపక్శాలు రకరకాల అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు వాటిపై స్పందించిన పరిస్థితి లేదు.తన పని తాను చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలను ఖాతరు చేయడం లేదు.ఇందులో అసలు వ్యూహం ఏంటంటే ప్రతిపక్షాల మాటలకు సమాధానం ఇచ్చుకుంటూ వెళ్తుంటే ప్రజలు టీఆర్ఎస్ పనితీరును మర్చిపోయే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ప్రతిపక్షాలు కూడా సీఎం స్థాయి వ్యక్తులు కూడా ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తే ఇక ప్రతిపక్షాలు చెలరేగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకే చేయవలసిన పనుల మీద కేసీఆర్ దృష్టి పెట్టినట్టు సమాచారం.

#@trspartyonline #@JaiKCR29 #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు