కేంద్ర ప్రకటనపై కెసీఆర్ అసంతృప్తి...ఇక బీజేపీని శాశ్వత దోషిగా నిలబెట్టనున్నారా?

వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు, ప్రతి విమర్శల నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే డైరెక్ట్ గా కేసీఆర్ ఈ విషయంపై స్పందించడం ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది.

 Kcr Dissatisfied With Centre's Statement  Will Bjp Be Made A Permanent Culpritel-TeluguStop.com

పార్లమెంట్ లో కూడా యాసంగిలో బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తి లేదని ఖరాఖండీగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడంతో సదరు కేంద్ర మంత్రి ప్రకటన పట్ల కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.అయితే మిగతా రాష్ట్రాలలో యధావిధిగా ఎటువంటి ఆంక్షలు లేనప్పుడు ప్రత్యేకంగా తెలంగాణకు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా ఆంక్షలు అని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది.

ఇక ఈ విషయంలో తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Telangana-Pol

తెలంగాణలో అత్యధికంగా పండిస్తున్న వరిని పండించవద్దని అంటే రైతులు ఎంత తీవ్రంగా నష్టపోతారనేది కేంద్ర ప్రభుత్వానికి అసలు అవగాహన ఉందా అంటూ కేసీఆర్ అభిప్రాయ పడ్డ విషయం తెలిసిందే.అయితే రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్న ఈ విషయంలో బీజేపీని శాశ్వతంగా ప్రజలలో దోషిగా నిలబెట్టే విధంగా వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది.తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అనే ముద్ర ప్రజల్లో శాశ్వతంగా పడడానికి అవకాశం ఉంటుంది.

దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా మారే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఈ వరి ధాన్యం కొనుగోళ్ళ అంశానికి ముగింపు ఎప్పుడు పడుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube