కేసీఆర్ వ్యూహం మామూలుగా లేదు ! 'భారీ' గా ప్లాన్ చేశారే ?

ఎలా అయినా హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా అనేక వ్యూహాలు పన్నుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.రాజేందర్ ఇక్కడ ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా అనుభవం ఉండడం, ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో ఆయన హవా తగ్గించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Kcr Diseded On Open Meetings In Hujurabad Constency, Kcr, Ktr, Telangana, Trs Go-TeluguStop.com

మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిని నియోజకవర్గం పైన దృష్టి పెట్టేలా చూస్తున్నారు.ఇక దళిత బంధు వంటి భారీ బడ్జెట్ పథకాన్ని ఈ నియోజకవర్గంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ పథకాలు, మంత్రులు ఎమ్మెల్యేలు, నాయకుల కృషి, ఇవన్నీ తమకు విజయాన్ని తీసుకొస్తాయని ఒకవైపు నమ్ముతున్నా, మరోవైపు మాత్రం రాజేందర్ కు ఉన్న బలమైన నెట్ వర్క్ , ఇవన్నీ కేసీఆర్ కు భయాన్ని పెంచుతూనే ఉన్నాయి.టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు రెండో వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతకుముందు ఈ నియోజకవర్గంలో దళితుల్లో ప్రభుత్వంపై ఆదరణ పెరిగేలా, వారు ఉంటున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Telugu Etela Rajendar, Kcr, Telangana, Trs-Telugu Political News

ఇవే కాకుండా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి, దళిత బంధు పథకం గురించి సమగ్రంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.ఈమేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం క్రెడిట్ పెరిగేలా చేసుకుని, ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా  కెసిఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.గతంలో రైతుబంధు పథకాన్ని ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రమోద్ చేసి టిఆర్ఎస్ కు మేలు జరిగేలా చేసుకున్నారో అదే విధంగా ఈ దళిత బందు పథకం తో పాటు , టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రజలకు ఏ ఏ మంచి పనులు చేసింది ? ఎన్ని పథకాలు ప్రవేశపెట్టింది వంటి వాటిని బహిరంగ సభలో ప్రస్తావించి, టిఆర్ఎస్ కు బలం పెరిగేలా చేసుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు గా కేసీఆర్ కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube