ఏపీలో ఏం చేద్దాం ..? ఎటూ తేల్చుకోలేకపోతున్న టీఆర్ఎస్

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు ఏపీ విషయంలో డైలమాలో పడిపోయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రెస్ మీట్ లో ఆర్బాటంగా చెప్పిన కేసీఆర్ ఆ గిఫ్ట్ ఎలా ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడుతుందని… తాము ప్రచారం చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా లబ్ధి చేకూరి అధికారం చేపడుతుందని కేసీఆర్ భావించాడు.

 Kcr Discussion On Ap Politics-TeluguStop.com

అందుకే జగన్ మద్దతుగా కేటీఆర్ సైతం రంగంలోకి దిగి లోటస్ పాండ్ లో ఆయనతో చర్చలు కూడా జరిపారు.ఇంతవరకూ వ్యూహాత్మకంగా … తమ ప్లాన్ అమలు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఈ విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రచారం చేయడం ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది …ఎంత వరకు నష్టం చేకూరుస్తుంది అని టిఆర్ఎస్ డైలమాలో పడిపోయింది.అందుకే నేరుగా ప్రసారం చేయడం కంటే… వేరే రూట్ లో ప్రచారం చేయడం ద్వారా టిడిపిని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది.అందుకే ఇప్పుడు కొత్త రూట్ లో వెళ్లాలని చూస్తోంది.దీనిలో భాగంగా…

కుల సంఘాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీకి వ్యతిరేకంగా వాళ్లను రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచన చేస్తోంది.

ఏపీ రాజకీయాలలో టీఆర్ఎస్ వేలుపెట్టి తమకు మేలు చేస్తుందని తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు.ఈ కోణంలో కూడా ఆలోచించి ఏపీలో ప్రచారంపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఏపీలో ప్రచారానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో అనే ఉన్నారో తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఇందుకోసం కొందరు నాయకులను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.పనిలో పనిగా… ఒకసారి సర్వే చేయించి … ఆ ఫలితాలకు అనుగుణంగా… తమ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నాడు.

ఇక ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా… సందిగ్ధంలోనే ఉంది.

ఎందుకంటే టీఆర్ఎస్ – వైసీపీ స్నేహబంధంపై ఇప్పటికే టీడీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది.ఆ దాడితో ఏపీ ప్రజల్లో కూడా ఒకరకమైన అనుమానం కూడా మొదలయ్యింది.

అందుకే ఇప్పుడు వైసీపీ , టీఆర్ఎస్ కూడా ఈ విధంగా తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube