హలో...! నేను కేసీఆర్ ని మాట్లాడుతున్నా...  

CM KCR Tension over BJP Politics in Telangana, CM KCR, BJP, Congress, Telangana, Employees, KCR Phone to Employees - Telugu Bjp, Cm Kcr, Cm Kcr Tension Over Bjp Politics In Telangana, Congress, Employees, Kcr Phone To Employees, Telangana

ఎప్పుడూ భిన్నమైన వైఖరితోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తూ ఉంటారు.ఎప్పుడూ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, పార్టీకి , ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు.

TeluguStop.com - Kcr Direct Phone Calls On Employees

మొన్నటి వరకు ఎవరిని లెక్క చేయని విధంగా ఉండేవారు కేసీఆర్.  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉండేది.

కానీ కొత్త శత్రువుగా పుట్టుకొచ్చిన బిజెపి  తెలంగాణ లో ఈ మధ్యకాలంలో బాగా బలం పెంచుకుంది.టిఆర్ఎస్ కు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తోంది.

TeluguStop.com - హలో… నేను కేసీఆర్ ని మాట్లాడుతున్నా…-Political-Telugu Tollywood Photo Image

అదే విధంగా తెలంగాణలో అధికారం సంపాదించే అంతటి స్థాయిలో బలం పెంచుకుంటూ టిఆర్ఎస్ కు కంగారు పుట్టిస్తోంది.దీనికితోడు ప్రజల్లోనూ టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న అంశాన్ని నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో  గతంలో మాదిరిగా రాజకీయాలు చేస్తే లాభం ఉండదు అనే ఉద్దేశంతో , ప్రజలలో బలం పెంచుకునే అంశాలపై కెసిఆర్ దృష్టి పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.రైతులకు, ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తూ, ఆయా వర్గాల్లో బలం పెంచుకునే కార్యక్రమాలపై కేసిఆర్ దృష్టిసారించారు.తాజాగా ఉద్యోగులకు  ఫోన్ నేరుగా కేసీఆర్ చేస్తూ, వారి సాధక బాధకాలు అన్నిటిని, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.బదిలీలు, ట్రాన్ఫఫర్స్, ఇలా అన్నిటినీ గురించి నేరుగా ఉద్యోగులకు ఫోన్ లు చేస్తూ తెలుసుకుంటున్నారు.

అలాగే రైతులు, అనేక రంగాల్లో ఉన్న వారికి నేరుగా ఫోన్ లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.స్వయంగా కేసీఆర్ ఫోన్ లు చేసే సరికి ఆ ఫోన్ కాల్స్ అందుకున్న వారి ఆనందానికి అవధులే లేకుండా పోతోంది.

ఇలా ఎక్కడికక్కడ అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఏది ఏమైనా బీజేపీ బలం తెలంగాణలో పెరగకుండా అన్ని రకాలుగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

#Employees #KCRPhone #CMKCR #Telangana #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు