జగన్ కి మైలేజ్ ..బాబుకి డ్యామేజ్ ! కేసీఆర్ తిట్టింది అందుకేనా ?

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.టీఆర్ఎస్ అధికారం దక్కించుకుని దాదాపు 20 రోజులు కావొస్తోంది.

 Kcr Did Damage Chandrababu Naidu Image In Press Meet-TeluguStop.com

ఇంకా అక్కడ మంత్రి మండలి ఏర్పడలేదు.కనీసం ఎమ్యెల్యేల ప్రమాణ స్వీకారం కూడా పూర్తవ్వలేదు.

ఈ దశలో అక్కడ రాజకీయాల్లో బిజీ బిజీ గా ఉండాల్సిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు మీద తిట్ల వర్షం కురిపించడంతో బిజీ అయ్యాడు.అది మామూలు రేంజ్ లో తిట్టలేదు.

తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసాడు.కేసీఆర్ బాబు ని తిట్టడం మామూలే అయినా… ఇంత అత్యవసరంగా బాబు ని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనే డౌట్ ఇప్పుడు అందరికి కలుగుతోంది.

తెలంగాణాలో ఉత్కంఠ పోరులో సైతం టీఆర్ఎస్ పార్టీని గెలిపించి తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నాడు కేసీఆర్.అందుకే ఆయనకు ఆ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇమేజ్ పెరిగింది.

ఇప్పుడు ఆ ఇమేజ్ ని వాడేసుకునేందుకు కేసీఆర్ సిద్ధం అయిపోయాడు.ఇక కేసీఆర్ బీజేపీతో రహస్య పొత్తు కొనసాగిస్తున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే.ఆయనే కాదు ఏపీలో వైసీపీ , జనసేన కూడా పైకి ఒప్పుకోకపోయినా…లోలోపల మాత్రం మోదీ డైరక్షన్ లోనే నడుస్తున్నాయి.ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీని అధికారంలోకి రాకుండా చేయాలనీ మోదీ ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తున్నాడు.

అందుకే జగన్ కి అంతరగతంగా సపోర్ట్ ఇస్తున్నా… మోదీ ఆశించిన స్థాయిలో చంద్రబాబు ని జగన్ ఎదుర్కోలేకపోతున్నాడు అనేది ఆయన ఫీలింగ్.అందుకే ఇక జగన్ ఒక్కడినే నమ్ముకునే కంటే.

ఇప్పుడు తెలంగాణ ఛాంపియన్ గా ఉన్న కేసీఆర్ తో బాబు మీద విమర్శలు చేయిస్తే… జనాల్లోనూ దీనిపై చర్చ జరుగుతుందని మోదీ నమ్ముతున్నాడు.

కేసీఆర్ కి గట్టి కౌంటర్ కూడా బాబు ఇవ్వలేడు అని ఈ ప్లాన్ అమలు చేసినట్టు రాజకీయ చర్చ నడుస్తోంది.ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టిపెట్టి అనేక రాష్ట్రాల్లో పర్యటించాడు.పనిలో పనిగా ఢీల్లి కూడా వెళ్లి ప్రధాని దర్శనం కూడా చేసుకున్నాడు.

ఆ తరువాత తెలంగాణ వచ్చేసారు.వచ్చి రాగానే అన్ని విషయాలు పక్కన పెట్టి టార్గెట్ చంద్ర బాబు అనే విధంగా విమర్శలు గుప్పించాడు.

మోదీ – కేసీఆర్ భేటీలో ప్రధాన చర్చ బాబు మీదే జరిగిందని … ఇక చంద్రబాబు విషయంలో జగన్ స్పీడ్ సరిపోవడంలేదని అందుకే మీరు నేరుగా రంగంలోకి దిగాలని కేసీఆర్ కి ప్రధాని సూచించినట్టు అర్ధం అవుతోంది.చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం ద్వారా ఏపీలో వైసీపీకి కలిసొస్తుందని కూడా వీరు నమ్ముతున్నారు.

ఇక రానున్న రోజుల్లో ఈ రాజకీయం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube