ప్రజల్లో అసంతృప్తిని కేసీఆర్ గుర్తించారా ? అందుకేనా ఈ కీలక నిర్ణయం 

ఎప్పటికప్పుడు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి.వాటిపై ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏమిటి ? ప్రతిపక్షాలు ఏ విషయంలో తమపై పట్టు సాధిస్తున్నాయి.ఇలా అనేక అంశాలు గురించి ఎప్పటికప్పుడు  సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుసుకుంటూనే ఉంటారు.దానికి అనుగుణంగా చిన్నచిన్న మార్పులు చేపట్టి తమకు ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటారు.

 Kcr Decided To Recognize The Growing Opposition Of The People Against The Trs Government And Resolve It , Trs, Telangana, Kcr, Bjp, Congress, Trs Tention, Revanth Reddy,bjp,dharani Portal, Telangana Elections,-TeluguStop.com

అయితే గతంతో పోలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, దీనిని అవకాశంగా తీసుకుని కాంగ్రెస్  బిజెపిలు జనాల్లో పట్టు సాధిస్తున్నాయనే విషయాన్ని కెసిఆర్ గుర్తించారు.
  ఈ పరిణామాలు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని,   ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని  తమ రాజకీయ ప్రత్యర్థులు ఉపయోగించుకుని సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉండడంతో కేసిఆర్ అలర్ట్ అయ్యారు.

ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో ఏ ఏ విషయాలపై అసంతృప్తి పెరుగుతుంది అనే అనేక అంశాలపై ఇప్పుడు కేసీఆర్ దృష్టి పెట్టారు.ముఖ్యంగా ‘ ధరణి ‘ పోర్టల్ పై ప్రజల్లో అసంతృప్తి రోజు రోజు కీ పెరుగుతోంది.

 Kcr Decided To Recognize The Growing Opposition Of The People Against The Trs Government And Resolve It , TRS, Telangana, Kcr, Bjp, Congress, Trs Tention, Revanth Reddy,bjp,dharani Portal, Telangana Elections, -ప్రజల్లో అసంతృప్తిని కేసీఆర్ గుర్తించారా అందుకేనా ఈ కీలక నిర్ణయం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ ధరణిని రద్దు చేయాలని టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు.
 

ప్రజల్లోనూ దీనిపైన తీవ్ర అసంతృప్తి ఉంది.దీనిని ముందుగానే గుర్తించిన కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన డిక్లరేషన్ లోను ధరణి రద్దు అనే అంశాన్ని కూడా చేర్చంది.దీనిపై జనాల్లోనూ కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుండడాన్ని గుర్తించిన టిఆర్ఎస్ ధరణిని రద్దు చేయకుండా దానిలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించుకుంది.

అలాగే ప్రభుత్వ పథకాల అమలులో నెలకొన్న లోటు పాట్లను గుర్తించడం,  కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం, పల్లె నుంచి పట్నం వరకు ప్రధానంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ తాజాగా నిర్ణయించుకున్నారట.

 

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube