టీడీపీలోకి కేసీఆర్ కుమార్తె ..?   KCR Daughter Join To TDP     2018-11-08   19:04:49  IST  Sai M

తెలంగాణాలో రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశిస్తున్న నాయకులు తాము పోటీ చేసేందుకు ఏ పార్టీలో అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుందో ఆ పార్టీలోకి ముందూ వెనుక ఆలోచించకుండా చేరిపోతున్నారు. తాజాగా… టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సీఎం చంద్రబాబును కలిశారు. టీడీపీలో చేరతానని ఆమె ప్రతిపాదించారు. కరీంనగర్‌ జిల్లా నుంచి పోటీచేసేందుకు రమ్య ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి అందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేతలతో కూడా రమ్య చర్చలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలో రమ్య విషయం ప్రస్తావించారు. ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే .. రెచ్చగొట్టినట్టు ఉంటుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.