కేసీఆర్ నిజంగానే గాలికొదిలేశారా?

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఇప్పటికే రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Did Kcr Give Up On Corona Spread, Kcr, Corona Virus, Telangana, Corona Tests, Pm-TeluguStop.com

ఈ క్రమంలో వారు ఆర్ధికంగా చాలా నష్టపోయారు.అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతో ప్రజలు తిరిగి తమ సాధారణ జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే ఈ లాక్‌డౌన్ ఎత్తేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపై వస్తుండటం, మాస్కులు పెట్టుకోకుండా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నారు.

దీంతో తెలంగాణలో అధిక సంఖ్యలో రోజూ కేసులు పెుగుతూ వస్తున్నాయి.

ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.అయితే రోజూ కేసుల సంఖ్య ఇంచుమించు వెయ్యి వరకు పాజిటివ్‌గా వస్తుండటంతో హైదరాబాద్ నగరాన్ని మరోసారి లాక్‌డౌన్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై రోజూ మంత్రులు, అధికారులు, వైద్యులతో చర్చలు జరుపుతున్నారు.

కాగా ఎక్కవమంది హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని సూచించడంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా అటు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ నియంత్రణలో కేసీఆర్ చేతులెత్తేశాడా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది.లాక్‌డౌన్ సమయంలోనే కరోనా వైరస్ టెస్టులు అధిక సంఖ్యలో చేసుంటే, ప్రస్తుత పరిస్థితులను అదుపులో పెట్టేవారని, ఇప్పుడు హైదరాబాద్ కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఇక కేవలం లాక్‌డౌన్ విధించినంత మాత్రాన కరోనా కంట్రోల్ అవుతుందనుకుంటే కేసీఆర్ చాలా తప్పుచేసిన వారవుతారు అని ప్రతిపక్ష నేతలు ఆయనపై మండిపడుతున్నారు.మరి వారందరికీ కేసీఆర్ ఎలాంటి బదులు ఇస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube