అక్కడ రోజుకో అభ్యర్థి ! టీఆర్ఎస్ లో గందరగోళం ?

బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అంత కంటే బలమైన వ్యక్తిని పోటీకి దింపితే ఫలితం ఉంటుంది.అయితే ఆ బలమైన అభ్యర్థి ఎవరనే విషయంలో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఒకటే కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

 Kcr Confusion In The Case Of Huzurabad Trs Candidate, Trs Party, Telangana, Kcr,-TeluguStop.com

త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ పై ఎవర్ని పోటీకి దింపాలని అనే విషయంలో కంగారు పడుతోంది.హుజురాబాద్ లోనే కాకుండా తెలంగాణవ్యాప్తంగా రాజేందర్ కు గట్టి పట్టుంది.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయన టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉండడంతో పాటు,  హుజూరాబాద్ నియోజకవర్గం పై మొదటి నుంచి గట్టి పట్టు ఉండడంతో ఇప్పుడు ఆయన ను ఓడించే సత్తా ఉన్న నాయకుడిని ఎంపిక చేసే విషయంలో టిఆర్ఎస్ ఇంతగా కంగారు పడుతోంది.
  ఇప్పటికీ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

ముందుగా బిజెపి లో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది.ఆయన ఎంపిక పై టిఆర్ఎస్ వ్యతిరేకత కనిపించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.

ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి పేరు ప్రముఖంగా వినిపించింది.ఇక ఆ తర్వాత ముద్దసాని దామోదర్ రెడ్డి బంధువు పేరు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయన మాజీ ఐఏఎస్ కావడంతో ఆయనే అభ్యర్థి అంటూ హడావుడి నడిచింది.ఆ తర్వాత ఆయన పేరు సైలెంట్ అయిపోయింది.2018 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆయనే టిఆర్ఎస్ అభ్యర్థి అనే ప్రచారం మొదలైంది.

Telugu Etela Rajendar, Hujurabad, Koushik Reddy, Peddi, Telangana, Trs-Telugu Po

కౌశిక్ రెడ్డి ఓ ఫోన్ కాల్ లో టిఆర్ఎస్ టిక్కెట్ తనకే కన్ఫర్మ్ అయింది అంటూ చెప్పడం, ఆడియో బయటకు రావడం వైరల్ అయింది.అయితే ఎవరికి వారు తామే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులం అంటూ చెప్పుకోవడం, మీడియాలోనూ ఫలానా అభ్యర్థి టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు అంటూ హడావిడి జరగడం మినహాయించి అధికారికంగా టిఆర్ఎస్ మాత్రం ఎవరిని ధ్రువీకరించడం లేదు.ఎవరి పేరు ప్రకటించాలనే విషయంలో కేసీఆర్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube