ఈ ర్యాంకుల సర్వే గోల ఏంటి కేసీఆర్ ?

ఎప్పుడూ ఏదో ఒక అంశంతో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎప్పుడూ తన మార్క్ కనిపించేలా వ్యవహరిస్తూ ఉంటారు.

 Kcr Conduct The Survey About Minister Working Performence Report-TeluguStop.com

ఈ సందర్భంగా అనేక కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కేసీఆర్ ఎప్పుడు వెనుకంజ వేయరు.ప్రస్తుతం తెలంగాణలో అన్ని రకాల ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి.

ఇక పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టేందుకు కేసీఆర్ ముందుగా తన మంత్రి వర్గ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.తమ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరు ఎలా ఉంది ? వారు ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటున్నారు ఇలా అనేక అంశాలకు సంబంధించి వారి పనితీరుపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Kcr Ministers, Kcrconduct-Political

మంత్రుల పనితీరు ఆధారంగా వారికి గ్రేడ్ లు కూడా కేటాయించబోతున్నట్టు సమాచారం.దీని కోసం రాష్ట్ర ఇంటెలిజెన్స్ తో పాటు ఓ ప్రైవేటు సంస్థ కూడా ఈ బాధ్యతలు అప్పగించారట.ఈ రెండు సర్వేల్లోనూ పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించబోతున్నారట.ఇంటలిజెన్స్, ప్రైవేటు సర్వే నివేదిక వచ్చిన తర్వాత క్యాబినెట్ లో మంత్రులకు ఆ నివేదికల సారాంశాన్ని అందిస్తారట.వాటి ఆధారంగా వారికి ఏ బి సి డి లు నివేదిక అందజేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పుడు నివేదికలు అందుకునే సమయం వరకు మంత్రుల పనితీరు పై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోబోతున్నారు.

Telugu Kcr Ministers, Kcrconduct-Political

దీని ఆధారంగా చేసుకుని కొంతమంది ని తొలగించడంతో పాటు వారిని ఎందుకు తొలిగిస్తున్నాము అనే నివేదికను కూడా వారికి చూపించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.కానీ ఈ సర్వే మొత్తం రహస్యంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వ్యవహారమంతా కేటీఆర్ పర్యవేక్షిస్తున్న ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అలాగే కొత్తగా మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా ఈ సర్వేలను ఉపయోగించుకోబోతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube