ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్!

తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకీ బలహీన పడుతుంటే.దీన్ని అవకాశంగా మలుచుకున్న బిజెపి రోజురోజుకీ తన బలాన్ని పెంచుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీని షాక్ కి గురి చేస్తోంది.

 Kcr Comments On Narendra Modi, Telangana Cm, Kcr, Narendra Modi, Congress, Pv Na-TeluguStop.com

రాష్ట్రంలో బిజేపి వేగానికి కళ్లెం వేయాలని సీఎం కేసీఆర్ కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు అందులో భాగంగానే పివికు భారత్ రత్న ఇవ్వాలని డిమండ్ ను కేంద్రానికి పంపారు.ఆతరువాత వెంటనే బిజేపి నాయకులకు టైం ఇవ్వకుండా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని ఏడు గ్రామాలను అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు కేంద్రం కలిపిందని అలాగే సీలేరు ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు తీవ్రమైన నష్టం చేకూర్చారని ఆయన బిజేపి పై విమర్శనాస్త్రాలు సంధించారు.

సింగరేణి కారుణ్య నియామకాలపై శాసనసభలో స్పందించిన కేసీఆర్.సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అర్హత ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని అలాగే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.

సింగరేణి కార్మికులకు ఐటి రద్దు చేయాలనే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించవలసిందిగా తమ ఎంపీలను ఆదేశించానని కేసీఆర్ అన్నారు.మరి కేసీఆర్ చేసిన తాజా కామెంట్స్ పై బిజేపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube