ఈటెల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్... ఎందుకంటే?

కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయంగా ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నదనే చెప్పవచ్చు.అయితే కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెల ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటూ బలమైన వ్యూహాలు రచిస్తున్నాడు.

 Kcr Closely Watching The Spear Affair-TeluguStop.com

ఇప్పటికే హైదరాబాద్ నుండి ఈటెల నియోజకవర్గం హుజురాబాద్ కు వెళ్తున్న క్రమంలో అతి పెద్ద కాన్వాయ్ తో మార్గ మధ్యలో ముదిరాజు సంఘ నాయకులను కలుస్తూ రకరకాల ప్రచారాలకు తెరదీసాడు.అంతేకాక హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులను కాపాడుకోవడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికే గంగుల కమలాకర్ హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలతో భేటీ అయి టీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.ఈ వ్యవహారాన్ని మొత్తం గమనిస్తున్న కేసీఆర్ ఈటెల భేటీ వెనుక కారణాల్ని, ఈటెల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై కేసీఆర్ ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

 Kcr Closely Watching The Spear Affair-ఈటెల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్… ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే హుజురాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట అనే విషయం తెలిసిందే.అయితే ఈటెల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బలహీనపడితే దాని ప్రభావం రాష్ట్రమంతా పడే అవకాశం ఉంది.అందుకే హుజురాబాద్ పరిణామాలపై కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

#Huzurabad #@trspartyonline #Eetela Rajender #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు