విదేశీ పెట్టుబడిదారులకు కెసీఆర్ భరోసా

నాయకులు, పాలకులు యేవో మాటలు చెప్పి సామాన్య ప్రజలను నమ్మించగలరు.వారి సెంటిమెంట్లను ప్రభావితం చేసి తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోగలరు.

 Kcr Calls Telangana An Investor-friendly State-TeluguStop.com

కానీ పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ప్రధానంగా విదేశీయులను నమ్మించడం కష్టం.ప్రజలు పెట్టుబడులు పెట్టారు.

ఓట్లు వేస్తారు.కానీ పెట్టుబడిదారులు డబ్బు పెట్టి రిస్క్ చేస్తారు.

కాబట్టి వారికి నమ్మకం కలగడం చాలా కష్టం.పాలకులు పెట్టుబడులకోసం విదేశీయులనే నమ్ముకున్తున్నారు కాబట్టి వారు అడిగింది చేయాల్సిందే.

లేకపోతే మరొక చోటికి పోతారు.కెసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిగా విజయవంతం కాలేదు.

అందుకే పది రోజులు చైనా వెళ్లి అక్కడి కంపెనీల అధినేతలతో మాట్లాడి వచ్చారు.దాని ఫలితంగానే చైనా లోనే 14 పరిశ్రమలకు చెందిన 45 మంది ప్రతినిధులు కేసీఆర్తో మాట్లాడటానికి హైదరాబాదుకు వచ్చారు.

ఆ ప్రతినిధులకు ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ విధానాలు వివరించారు.ఎక్కడా అవినీతి లేకుండా, జాప్యం జరగకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని చెప్పారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని భరోసా ఇచ్చారు.చివరకు ఆయన ఒక్క మాటలో అసలు విషయం చెప్పారు.ఏమని? తెలంగాణా పెట్టుబడులకు స్వర్గం అని అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పారు.రెండు పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

తాను అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తానని కెసీఆర్ వాగ్దానం చేసారు.కాని ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ఉండవు కదా.ఇలా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇవ్వాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube