19 వ తేదీ ఉదయం 11 .30 కి .... తెలంగాణాలో ఏం జరగబోతోంది అంటే ...?

ఈ మధ్య కాలంలో తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే …? అది మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశమే.రెండు నెలలుగా నిత్యం ఇదే టాపిక్ కు సంబంధించి నిత్యం మీడియా లో వార్తలు వస్తూనే ఉన్నాయి.

 Kcr Cabinet Meet Will Be In 19th At 11 30-TeluguStop.com

దీఠనికి సంబంధించి రకరకాల ముహుర్తాలు, తేదీలు ప్రచారంలోకి వచ్చినా… అవన్నీ దాటిపోయాయి.కానీ మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ అయితే రాలేదు.

మీడియాలో ఏంటి.పార్టీలో ఏంటి దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉన్నాడు తప్ప ఈ ఉత్కంఠ కు తెరదించలేదు.

కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసాడని… ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలి అనే విషయంలో ఒక క్లారిటీ కి వచ్చాడని ప్రచారం జరిగింది.ఈ లోపునే కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ని కలవడంతో మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిలో హడావుడి మొదలయ్యింది.

ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది ఈ మేరకు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యింది.ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్.

మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు.

ఇక టీఆరఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్‌ ఉంది కానీ హరీష్ రావు ను ఎంపీగా పోటీ చేయించాలని చూస్తుండడంతో… ఆయనకు పదవి దక్కే అవకాశం అయితే లేనట్టే.

గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే తొలివిడత మంత్రివర్గ విస్తరణలో పరిమిత సంఖ్యలో మంత్రులను తీసుకుని సార్వత్రిక ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో విస్తరణ చేయాలనీ చూస్తున్నారు.

అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ శాసనసభ లో ఈ నెల 22న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.ఆర్ధిక మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి అధికారులతో కలిసి బడ్జెట్ ను రూపొందించారు.

అయితే కొత్తగా ఆర్ధిక మంత్రి గా నియమించినవారే బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు.

తెలంగాణ మొట్టమొదటి ఆర్ధిక మంత్రి గా ఈటెల రాజేంద్ర నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.ఆయనకు మరో అవకాశం వస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube