అయ్యో కేసీఆర్ ఉసూరుమనిపించారే ! మళ్ళీ ఎప్పుడో...?  

తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ పై రోజు రోజుకి ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. వాస్తవంగా ఈ రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే అది ఇప్పుడు లేదని తేలిపోయిందని. అసలే ఈ రోజు మంచి ముహుర్తం.. వసంత పంచమి.. ఇక విస్తరణే అనుకున్న ఆశావాహులందరికి షాక్ తగిలింది. ఓ దశలో కేసీఆర్ ఎర్రవెల్లిలో చండీ యాగం తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే భారీగా ప్రచారం జరిగింది. యాగం ముగిసింది కానీ కేసీఆర్ మాత్రం తన మనసులో ఏముంది అనే విషయంలో మాత్రం ఎవరికీ చెప్పలేకపోతున్నాడు. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కావటంతో ఆ తేదీన క్యాబినెట్ విస్తరణ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు నిరాశే ఎదురయ్యింది.

ప్రస్తుతం ఎవరికీ అంతుచిక్కని సమస్య ఏంటి అంటే…? కేసీఆర్ తీరు. అసలు ఆయన మనసులో ఏముంది…? మంత్రివర్గ విస్తరణపై ఆయన నిర్ణయం ఏంటి…? ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నాడు…? మంత్రివర్గ విస్తరణపై ఇన్ని కధనాలు వస్తున్నా … ఎందుకు పట్టించుకోవడంలేదు అనే సవాలక్ష సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ఆ మంత్రివర్గంలో ఆరు నుంచి ఎనిమిది మందికి స్థానం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ అవకాశం అందుకోబోయేది ఎవరన్నది మాత్రం కొంచెం కూడా లీక్ అవ్వకుండా కేసీఆర్ జాగ్రత్తలుపడుతున్నాడు. కేసీఆర్ నుంచి ఏ క్షణం పిలుపు వచ్చినా…. తాము అందుబాటులో ఉండాలని ఆశావాహులంతా హైదరాబాద్ లోనే మకాం వేశారు.

KCR Cabinet May See Expansion Two Months After Massive Mandate-Cm Kcr February 14th Massive Mandate Telangana

KCR Cabinet May See Expansion Two Months After Massive Mandate

ఈ నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి తేదీలు నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలకు సన్నద్దం అవుతున్నారు సిబ్బంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపే ఖచ్చితంగా మంత్రి వర్గ కూర్పు చేస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఈనెల 14 తర్వాత కేంద్రం నుంచి ఆర్దిక సంఘం అధికారులు వచ్చి వెళ్తారు.ఆ తర్వార మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉండొచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం బయలుదేరాయి. అయితే ఇప్పటికే రకరకాల ముహుర్తాలు మారిన నేపథ్యంలో…. ఏ తేదీ ఫైనల్ చేస్తాడో అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. మరి ఫిబ్రవరి 14 వ తేదీన ముహూర్తం అయినా ఫైనల్ అవుతుందో లేక మరో తేదీ మారుతుందో చూడాలి.