కేసీఆర్ ని వణికిస్తున్న...'ఆ ఒక్క పాట'  

Kcr Bothering About Epuri Somanna On Kcr-

పూర్వం పాటలని బండరాళ్ళు సైతం కరిగేవని.వర్షాలు కురిసేవని..

కేసీఆర్ ని వణికిస్తున్న...'ఆ ఒక్క పాట'-KCR Bothering About Epuri Somanna Song On KCR

ఇలా ఎన్నో ఎన్నో కధనాలు మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు అయితే అవన్నీ మనం చూసినవి కాకపోయినా ఒక కమ్మని పాట వింటుంటే ఎంతో హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.అయితే అదే పాట ప్రజలో చైతన్యం తీసుకువస్తుందని.భానిస సంకెళ్ళ నుంచీ విముక్తి కలిగిస్తుందని.

అణగారిన ప్రజలకి ఒక మార్గం చూపిస్తుందని మనకందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు ఇలాంటి పాటల ద్వారా మొదలయినవే. సక్సెస్ అయినవే.

దీనికి నిదర్శనమే తెలంగాణా ఉద్యమం.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదింది.అందరిలో ఒక ఊపు తీసుకొచ్చింది…పాటే అప్పట్లో ప్రజా గాయకులు గద్దర్‌…విమలక్క…అందెశ్రీ.జయరాజ్‌…సురేందర్‌.రసమయి.ఇలా ఎంతో మంది రాసి పాడిన పాటలు ప్రజల్లో ఉద్యమ స్పూర్తికి కారణమయ్యాయి.అప్పట్లో.

తెలంగాణ గాయకుల పాటలు చూసిన సమైక్యాంధ్ర ఉమ్యమకారులు కూడా తమకు ఇటువంటి గాయకులు ఉంటే బాగుండేదని వాపోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వ్యక్తులు కాదు కేలవం ఒకే ఒక్క పాట..

కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు…సీఎం కుర్చీని అలంకరించాడు అంటే ఆ పాటే ఉద్యమ సమయంలో ‘గద్దర్‌’ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ప్రజల మీద ఎంత ప్రభావం చూపిందో ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు.ఇలా ఎన్నో ఎన్నెన్నో పాటలు సీఎం గా కేసీఆర్ ని కుర్చీలో కూర్చో పెట్టాయి.

అయితే ఇప్పుడు అదే తరహాలో వస్తున్న పాటలు కేసీఆర్ ని గద్దె దించడానికి సిద్దమవుతున్నాయి. గాయకులూ తిరగబడితే ఎలా ఉంటుందో కేసీఆర్ కి రుచి చూపించడానికి సిద్దమవుతున్నాయి.తాజాగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదలైన ఒక పాట తెలంగాణలో సంచలన సృష్టిస్తోంది.

“ఏపూరి సోమన్న” అనే రచయితా , గాయకుడు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడుతున్న పాటలు. కెసిఆర్‌ను వణికిస్తున్నాయి…ముఖ్యంగా ‘ఎవడి పాలయిందిరో…తెలంగాణ’ అనే పాట తెలంగాణా వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది అంతేకాదు కేసీఆర్ పై వ్యతిరేకతని తీసుకుని రావడంలో ఈ పాట బాగా ఉపయోగపడుతోందని కాంగ్రెస్ నేతలు చంకలు గుద్దుకుంటున్నారట…కాంగ్రెస్‌ ఎక్కడ సభలు పెట్టినా…ఈ పాటను పాడిస్తూ…ప్రజలను చైతన్యం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో విరిగా వాడుతోన్న ‘బతుకమ్మ.బతుకమ్మ” అనే పాట…కెసిఆర్‌ ఏందిరో.వాడు పీకుడేందిరో.

అనే పాట కానీ.ప్రజలను ఉత్తేజులను చేస్తోంది..

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి ఏ పాటల మాటున కేసీఆర్ అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు అవే పాటలు కేసీఆర్ ని తెలంగాణలో ప్రతిపక్షంలో కూర్చో పెట్టడానికి సిద్దంగా ఉన్నాయట. నాలుగేళ్లల్లో కెసిఆర్‌ ఏమి చేశాడన్నదాన్ని సూటిగా నిలదీస్తూ.

దాన్నే పాటగా మారుస్తోన్న ‘సోమన్న’ పాటలపై కాంగ్రెస్‌ ప్రశంసలు గుప్పిస్తోంది.మొత్తానికి ఈ పాటల ఊబిలో కేసీఆర్ కుర్చీ ఊడిపోతుందో లేక దీనికి కౌంటర్ గా కేసీఆర్ ఏదన్నా వ్యూహాన్ని అమలు చేస్తాడో వేచి చూడాలి.