20 కోట్ల కేసీఆర్.. వదలనంటున్న ప్రొడ్యూసర్!  

KCR Biopic Budget 20 Crores, KCR, KCR Biopic, Madhura Sreedhar, Tollywood News - Telugu Kcr, Kcr Biopic, Madhura Sreedhar, Tollywood News

టాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల క్రేజ్ వేరుగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ రెండు భాగాలుగా తెరకెక్కించి రిలీజ్ చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 Kcr Biopic Budget 20 Crores

కానీ అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్ మహానటి చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.అటు వైయస్ఆర్ బయోపిక్ యాత్ర సినిమాకు కూడా ప్రేక్షకులు మంచి మార్కులు వేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఓ భారీ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం కావడంతో ఈ బయోపిక్ అటకెక్కేసిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

20 కోట్ల కేసీఆర్.. వదలనంటున్న ప్రొడ్యూసర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఈ సినిమాపై మరోసారి చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.కేసీఆర్ లాంటి నాయకుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుందని, అందుకే తమకు చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నామని, అందుకే ఈ సినిమాకు ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని ఆయన అన్నారు.దీంతో కేసీఆర్ బయోపిక్ మూవీ మామూలు చిత్రంగా రావడం లేదని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నటీనటుల కోసం వెతుకున్నట్లు ఆయన వెల్లడించారు.మరి రూ.20 కోట్ల కేసీఆర్‌గా ఎవరు నటిస్తారో చూడాలి.

#KCR #Kcr Biopic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kcr Biopic Budget 20 Crores Related Telugu News,Photos/Pics,Images..