కేసీఆర్ తో బాలయ్య భేటీ ? ఆ క్లారిటీ కోసమేనా ?  

Kcr Balakrishna Meeting June8th - Telugu Balakrishna, Chiranjeevi, Film Industry, Kcr,, Lockdown Eases

అన్నదమ్ములవలె కలసి మెలసి ఉంటామని, మా మధ్య ఎటువంటి విబేధాలు లేవని పదే పదే చెప్పుకునే టాలీవుడ్ లో ఇప్పుడు వరుస వివాదాలు చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.

 Kcr Balakrishna Meeting June8th

ఇప్పటికే చిరు బాలయ్య ఇలా రెండు వర్గాలుగా ఇండ్రస్ట్రీ విడిపోయి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ వివాదం రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది అనుకుంటున్నా సమయంలోనే ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వివాదాన్ని పెంచుకుంటూ పోతే టాలీవుడ్ లో ఐక్యత లేదనే విషయం బయటకి పొక్కడం, ఇండ్రస్ట్రీ పరువు పోతుంది అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్ తో బాలయ్య భేటీ ఆ క్లారిటీ కోసమేనా -Political-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా బాలయ్య చేసిన విమర్శలు బాగా వైరల్ అయ్యాయి.

మంత్రితో కలసి భూములు పంచుకునేందుకు వారంతా వెళ్లారు అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో బాలయ్య తీరుపై టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లోనూ ఆగ్రహం వ్యక్తం అయ్యింది.

ప్రత్యేకించి బాలయ్య వ్యవహారంపై కేసీఆర్ కూడా ఆరాతీసినట్టు సమాచారం.మొత్తంగా చూసుకుంటే తాను ఈ వ్యవహారంలో బాగా కార్నర్ అయ్యానని గ్రహించిన బాలయ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జూన్ 8 వ తేదీతో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉండడంతో బాలయ్య స్వయంగా కేసీఆర్ ను కలిసి ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా అసలు తాను ఏ ఉద్దేశంతో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ? తనను టార్గెట్ చేసుకుని సినీ పెద్దలు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు, తనని పక్కన పెట్టడానికి కారణం ? ఇలా అన్ని విషయాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చి కేసీఆర్ తో ఏ వివాదం లేకుండా చేసుకోవాలని బాలయ్య చూస్తున్నట్టు తెలుస్తోంది.జూన్ 8 వ తేదీ తరువాత బాలయ్య కేసీఆర్ భేటీపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test