కేసీఆరే ఛాన్సలర్‌....!

సాధారణంగా ఏ రాష్ర్టంలోనైనా విశ్వవిద్యాలయాలకు రాష్ర్ట గవర్నరే ఛాన్సలర్‌గా ఉంటారు.వైస్‌ ఛాన్సలర్లను ఆయనే నియమిస్తారు.

 Kcr As Chancellor Of Universities-TeluguStop.com

ఇప్పటివరకు ఉన్న సంప్రదాయం ఇదే.కాని తెలంగాణలో ఇక మీదట ఈ సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరమగీతం పాడబోతున్నారని వినవస్తోంది.అన్ని విశ్వవిద్యాలయాలకు ఆయనే ఛాన్సలర్‌ (కులపతి)గా ఉంటారట.ఇందుకోసం ప్ర స్తుత చట్టాన్ని సవరించాలని ఆలోచిస్తున్నారని సమాచారం.వీసీల కోసం ఒక సెర్చ్ కమిటీని నియమించి వారు ఇచ్చే మూడు పేర్లలోంచి గవర్నర్‌ ఒకరిని వీసీగా నియమిస్తారు.ఈ విషయంలో ఒక్కోసారి గవర్నర్‌కు, రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తే అవకాశాలున్నాయి.

ప్రభుత్వం చెప్పిన పేరును గవర్నర్‌ కాదనొచ్చు.గవర్నర్‌ అనుకున్నవారిని ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు.

ఈ తలనొప్పి ఎందుకని కేసీఆర్‌ అనుకున్నారేమో తానే ఛాన్సలర్‌గా ఉండాలని ఆలోచన చేస్తున్నారు.తనకు ఇష్టమైనవారిని హాయిగా నియమించుకోవచ్చు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ మొదటి ఛాన్సలర్‌గా ఉన్నారు.తెలంగాణలో ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube