'తెలంగాణా' ప్రజల దీవెన!!!

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన కేసీఆర్ ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రజాపలన విషయంలో దూకుదుగానే దూసుకు పోతున్నారు.ఇక నిన్న సాయానంత్రం జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.

 Kcr About Telangana Government-TeluguStop.com

తెలంగాణ ప్రజల దీవెన తనకు ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా ముందుకు సాగిపోతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరువలో ఉందని ఆయన తెలిపారు.

సభ్యత్వాన్ని 30 లక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.ప్రజలిచ్చిన స్ఫూర్తితో ఒళ్లు దగ్గర పెట్టుకుని పేదల ప్రభుత్వంగా మరిన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తామని ఆయన ప్రకటించారు.

ఇదే క్రమంలో ముందు అనుకున్నట్టుగా శుక్రవారంతో సభ్యత్వ నమోదు ముగిసినా ప్రజల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈనెల 28వ తేదీ వరకూ గడువుపెంచినట్టు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడిపించడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు.ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, ఇది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని అన్నారు.2018 నాటికి తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్‌పోని విధంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.పటిష్ఠమైన యంత్రాంగంతో అభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.మరి మాటల వరకు పర్వాలేదు కానీ…చేతలెయ్యి దొరా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube