కారు పార్టీకి ' కార్లు ' గండం ? కేసీఆర్ సీరియస్ ? 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల విషయంలో చాలా టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో పాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం గా మారే అవకాశం ఉండడంతో టిఆర్ఎస్ ఇంతగా టెన్షన్ పడుతోంది.

 Trs, Trs Car Symbol, Telangana, Kcr, Telangana Cm, Hujurabad Elections, Hareesh-TeluguStop.com

అది కాకుండా టిఆర్ఎస్ లో ఉంటూ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై తీవ్రస్థాయిలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడం , తదితర పరిణామాలు అన్నీ లెక్క వేసుకుని రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ ఇంతగా టెన్షన్ పడుతోంది.ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ ఈ నియోజకవర్గం నుంచి మండల, గ్రామాల వారీగా ఇంచార్జీలుగా నియమించింది.

ఈ  ఎన్నికలలో గెలుపు బాధ్యత హరీష్ రావు కు కేసీఆర్ అప్పగించారు.టిఆర్ఎస్ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గం లోని ప్రతి పల్లెకు వెళ్లి, ఓటర్లను కలిసి టిఆర్ఎస్ కు ఆదరణ పెరిగేలా చేయాలి అనే విధంగా ప్లాన్ చేశారు.

Telugu Hareesh Rao, Hujurabad, Telangana, Telangana Cm, Trs Car Symbol, Trs Symb

క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది.టిఆర్ఎస్ గ్రామ స్థాయి నాయకులు నుంచి అగ్ర నాయకులు వరకు అంతా ఈ నియోజకవర్గంలో ఖరీదైన కార్లలో ప్రయాణిస్తూ, ఏదో ఒక చోట కొంతమంది ప్రజలతో, నాయకులతో సమావేశం నిర్వహిస్తూ, తూతూమంత్రంగా వ్యవహారం చేస్తుండడం, భారీ ఎత్తున కార్లు గ్రామాల్లోకి వస్తుండడం, తదితర కారణాలపై జనాలలోనూ చర్చ జరుగుతోంది.ఒక్క రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ ఈ విధంగా భారీ స్థాయిలో కార్లలో నాయకులను ప్రచారానికి దింపుతుందని, అధికార పార్టీ దర్పం చూపిస్తోందనే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఏ మారుమూల పల్లెలో చూసిన ఖరీదైన కార్లు గ్రామాల్లో చక్కెర్లు కొడుతూనే కనిపిస్తున్నాయి.

అధికారపార్టీకి ఈ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి.ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇలా ఎవరికి వారు ఖరీదైన కార్లలో ఓటర్లను కలిసేందుకు వెళ్తుండటం తో, టిఆర్ఎస్ కు జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్లు గా కెసిఆర్ వరకు నివేదికలు వెళ్లాయి.

భారీ ఎత్తున వస్తున్న కార్ల కాన్వాయ్ పై జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో టీఆర్ఎస్ పై సానుకూలత పక్కనపెడితే, రాజేందర్ పై సానుభూతి పెరుగుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఒక్కో నేత ఒక్కో కారులో వెళుతూ, తమ సౌకర్యం చూసుకుంటుండగా జనాల్లో ఇది రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

Telugu Hareesh Rao, Hujurabad, Telangana, Telangana Cm, Trs Car Symbol, Trs Symb

నియోజకవర్గంలో కార్ల హడావుడి వ్యవహారంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనేక ఫిర్యాదులు ,నివేదికలు అందడంతో  ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది.గ్రామాల్లో కార్లతో ఈ విధంగా హడావుడి చేయడం వల్ల రాజేందర్ కు పెరుగుతుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు.ఇకపై కార్ల హడావుడి తగ్గించి ప్రతి గడపకు నాయకులు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని, ఈ విధంగా ఖరీదైన కారులో తిరుగుతూ తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీకి కలిసి వచ్చేది కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని సీరియస్ గా కొంతమంది నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక టిఆర్ఎస్ కార్ల హడావుడి వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారడంతో కారు పార్టీ ‘ కార్ల ‘ విషయంలో ఇంతగా కంగారు పడుతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube