స్టాలిన్‌, కేసీఆర్‌ భేటీ వల్ల ఏమైనా ఉపయోగమా?

ఒక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇందుకోసం ఈయన కాంగ్రెస్‌తో జత కట్టిన విషయం తెల్సిందే.

 Kcr And Stalin Meeting-TeluguStop.com

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జి మరియు ఇంకా పలువురు సౌత్‌, నార్త్‌ నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అయ్యాడు.ఇలాంటి సమయంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నాడు.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోయినా కూడా కేసీఆర్‌ ఎన్నికల తర్వాత పరిస్థితుల గురించి ముందే చర్చలు జరుపుతున్నాడు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపుతున్నాయి.

అప్పుడప్పుడు హడావుడి చేసే కేసీఆర్‌ ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నట్లుగా అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.ఇటీవలే కేరళ సీఎంను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించిన కేసీఆర్‌ నేడు తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు అయిన స్టాలిన్‌ ను కలువబోతున్నాడు.

తమిళనాడులో డీఎంకే పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది.

స్టాలిన్‌ ఎటు వైపు ఉంటే అటు బలం ఎక్కువగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరు కూడా అంగీకరించే విషయం.

అందుకే చంద్రబాబు నాయుడు అయిన కేసీఆర్‌ అయినా కూడా స్టాలిన్‌ను ఎక్కువగా ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు.మరి స్టాలిన్‌తో భేటీతో కేసీఆర్‌కు ఏమైనా ప్రయోజనం చేకూరేనా, అసలు ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube