కేసీఆర్ తో జగన్ భేటీ ? ఎప్పుడంటే

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు జగన్, కేసీఆర్ ఇద్దరూ గత కొంతకాలంగా ఎంతో అన్నోన్యంగా మెలుగుతూ ఉండడమే కాకుండా మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యల మీద చర్చించుకుంటూ ఒక పరిష్కారాన్ని వెతుకుతున్నారు.ఇప్పటికే ఈ ఇద్దరూ అనేకసార్లు భేటీ అయ్యి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, పంపకాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులతో కలిసి చర్చించి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే.

 Kcr And Jagan Meet On 13th Of This Month-TeluguStop.com

ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 13వ తేదీన భేటీ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్ భేటీ కాబోతున్నట్టు సమాచారం.

గతంలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించగానే తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చి ఆర్టీసీ కార్మికులు చాలాకాలం సమ్మెబాట పట్టారు.దీంతో కేసీఆర్ చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

దీనికి పరోక్షంగా జగన్ కారణం అయ్యారనే కోపం కూడా కేసీఆర్ లో ఉంది.తాజాగా రాజధాని అమరావతిపై రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇరువురి భేటీపై ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube