టీఆర్ఎస్ సభ హిట్టా కాదా .. ఆ తరువాత ఏంటి

తెలంగాణ ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి పెంచి తెలంగాణ వైపే అందరి ద్రుష్టి మళ్లేలా చేస్తూ వచ్చింది తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.ప్రగతి నివేదన సభ మొత్తానికి ముగిసింది.

 Kcr And His Mega Pragathi Nivedana Sabha Of 25 Lakh People-TeluguStop.com

ఈ సభపై కేసీఆర్ భారీగా అంచానాలు వేసుకున్నాడు.అంతే భారీగా సొమ్ములు ఖర్చుపెట్టారు .దాదాపు 25 లక్షలమంది హాజరవుతారని కేసీఆర్ ముందునుంచి చెప్పుకుంటూ వచ్చాడు.అయితే 5 లక్షల వరకు హాజరయినట్టు తెలుస్తోంది.

మొత్తానికి సభ ముగిసింది.అయితే ఆ సభ ద్వారా కేసీఆర్ చెప్పాలనుకున్నది చెప్పాడా .? సభ సక్సెస్ అయ్యిందా .ఈ సభపై కేసీఆర్ , ఆ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.

కొంగరకలాన్ సభకు హాజరైన టీఆర్ఎస్ కార్యకర్తల నిరుత్సాహానికి గురయినట్టు సమాచారం కేసీఆర్ ఏదో ఇంకేదో మాట్లాడేస్తాడని ఊహించుకుని హాజరయిన వారికి నిరాశే మిగిలింది.కేసీఆర్ ఇలా ఎందుకు మాట్లాడారు? ఎన్నికల శంఖారావం పూరిస్తారని అనుకున్నాం.కానీ త్వరలో నిర్ణయం చెబుతానని అన్నారు.ఇంతకీ ముందస్తు ఎన్నికలు ఉంటాయా? లేదా అనే సందేహాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా వంద సీట్లు వస్తాయన్న కెసీఆర్ లో ఆ జోష్ ఎందుకో కనిపించలేదు.దాదాపు గంట సేపు మాట్లాడిన కేసీఆర్ కనీసం కాంగ్రెస్ నేతలపై పంచ్‌లు ఎందుకు విసరలేదు.

తెలుగుదేశం నాయకులను ముఖ్యంగా చంద్రబాబును అయితే పేరు కూడా ప్రస్తావించకుండా అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అని సంభోదించడం.ఆయన పేరు చెప్పకుండానే ఆయన అహంకారాన్ని, అవినీతిని ప్రస్తావించడం వెనుక ఉన్నఉద్దేశం ఏంటో ప్రజలకు సరిగా అర్ధం కాలేదు.

సీఆర్ ముందస్తుకు వెళ్తున్నారా.లేదా అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు.ఆ పార్టీ ఎమ్మెల్యేలకే కాదు.మంత్రులకు కూడా లేదు.కేసీఆర్ స్పీచ్‌ను రకరకాలుగా విశ్లేషించుకుంటే.అటు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సందేశం కనిపిస్తోందని కొందరంటారు.

అసలు అలాంటి సూచనలే లేవని మరికొందరంటారు.ముందస్తుకు వెళ్లే పని అయితే.

ఎన్నికలకు సిద్ధంకమ్మని పిలుపునిచ్చేవారు కాదా.అని మరికొందరంటారు.

అన్నీ వాదనలు కరెక్టే.ఏదో ఒక వాదన వింటే.

నిజమే అనుకోవచ్చు.కానీ రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

ఏదీ నిజమో అర్థం కాని పరిస్థితి .జాతకాల్ని అమితంగా విశ్వససించే కేసీఆర్.ఆరో తేదీన కేబినెట్ భేటీ పెట్టి.అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube