భంధానికి బీటలు..వారిద్దరి మధ్య ఏమి జరుగుతోంది..??

టీఆర్ఎస్ లో అత్యంత కీలకంగా ఉన్న హరీష్ రావు వ్యవహార శైలి ఎవరికీ అంతుచిక్కడం లేదు.తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి హరీష్ రావు రాజీనామా చేసిన విషయం విధితమే అయితే.

 Kcr And Harish Rao Have Inner Allegations In The Family-TeluguStop.com

తాజాగా అయిన తనకి ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని సైతం ఖారీ చేయడం చర్చనీయంసంగా మారింది.

ఇప్పటి వరకూ ఆయన అధికారిక నివాసాని ఖాళీ చేయడం ఎందుకు అనేది తెలియక పోవడం కూడా సంచలనం సృష్టిస్తోంది.

అయితే ఈ హటాత్ పరిణామాలతో , హరీష్ పార్టీ మారుతున్నాడు అనే ఊహగానాలని మరింత ఊతం ఇస్తున్నాయి.కాని అసలు విషయం ఏమిటి అనేది మాత్రం స్పష్టంగా తెలియరావడం లేదు.అయితే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన నాటినుంచీ హరీష్ ఈ అలక పాన్పు ఎక్కాడు అంటూ వార్తలు వచ్చాయి.అంతేకాదు ఆ తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలో హరీష్ చురుకుగా కూడా పాల్గొనడం లేదని తెలుస్తోంది.

కేసీఆర్ మేనల్లుడు గా మాత్రమే కాకుండా తనకంటూ తెలంగాణలో ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న హరీష్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహం ఉండనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అయితే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారట.

మరి మంత్రి వర్గంలో తీసుకుంటే ఎలా పోటీ కుదురుతుంది అనేది మరికొందరి వాదన.

ఇదిలాఉంటే కావాలనే కేసీఆర్ హరీష్ కి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఒకానొక దశలో హరీష్ పార్టీ మారతారంటూ ప్రచారం కూడా జోరుగా ప్రచారం జరిగింది ఏకంగా కాంగ్రెస్ తో చర్చలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి.కాని ఆ ప్రచారాలని హరీష్ తిప్పికొట్టారు.

అలాంటిది పార్టీలో ఉన్నపళంగా హరీష్ లో నెలకొన్న తాజా వ్యవహార శైలిపై భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఏది ఏమైనా సరే మామా అల్లుళ్ళ మధ్య భందానికి బీటలు వారుతున్నాయనేది హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube