నాయకులకు చుక్కలు చూపిస్తున్న సర్వే లెక్కలు !

రాజకీయ పార్టీలకు ఇప్పుడు ప్రజానాడి తెలుసుకోవడం ఈజీ అయిపోయింది.ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు.? ఎక్కడ పార్టీ వీక్ గా ఉంది.? ఎక్కడ ఎక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి.? అనే అంశాలను తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నాయి.రాబోయే ఎన్నికల్లో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగానే డిసైడ్ అవ్వబోతున్నాయి.

 Kcr And Chandrababu 2019 Election Surveys-TeluguStop.com

ఇప్పుడు ఇదే నాయకుల కొంప ముంచుతున్నాయి.

ఎవరి ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయో సర్వేలు తేటతెల్లం చేసేస్తుండడంతో నాయకులూ అలకబూనుతున్నారు.మరికొందరు పక్క పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు.ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్ ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానాలు చెప్పేస్తుండడం నాయకుల అసంతృప్తికి కారణం అవుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి.తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఇప్పటికే ఓ సర్వేపై కేసీఆర్ చర్చలు నిర్వహించి నెగిటివ్ టాక్ ఉన్న ప్రాంతాల నాయకులకు వార్నింగ్ లు ఇచ్చేశారు.గెలిచిన నాయకులూ వచ్చే ఏడాది కూడా గెలవాలి అంటే అభివృద్ధి పనులను పూర్తి చెయ్యాలని లేకపోతే టికెట్ కష్టమని చెప్పేసారు.

అలాగే… తెలంగాణ ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ కూడా రెండు సర్వేలకు సిద్ధమైంది.ఇంకా అవి ఓ కొలిక్కి రాకముందే కొంత మంది నాయకులపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సర్వేల ద్వారా ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

దీంతో సీనియర్ నేతలు అలకలు మొదలవుతున్నాయి.దానం నాగేందర్ కూడా పార్టీ నుంచి బయటకు రావడానికి అదొక కారణమని తెలుస్తోంది.

అలాగే.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సర్వేల కారణంగా ఆ పార్టీలో నాయకులూ చాలామంది అలకబూనారు.ఇందులో ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు.ఆయనపై ఇప్పటికే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సారి గెలవడం కష్టమని తేలడంతో అక్కడ ప్రత్యామ్న్యాయం మీద టీడీపీ దృష్టిపెట్టింది.

దీంతో గంట అలకబూనారు.చంద్రబాబు మాట్లాడే వరకు ఆయన ఒక దారికి రాలేదని కథనాలు వెలువడుతున్నాయి.

మరికొంత మంది పై కూడా సర్వేల ఎఫెక్ట్ పడనుందని టీడీపీ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి.సర్వేల రిపోర్టులు ఇంకా ఎంతమంది రాజకీయ జీవితాలను తారుమారు చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube