షర్మిలకు గురి పెట్టిన కేసీఆర్...ఇక గడ్డు కాలమేనా?

తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సడెన్ గా తెలంగాణ రాజకీయ వర్గాలలో షర్మిల కలకలం రేపిన విషయం తెలిసిందే.అసలు ఎవరు ఊహించకుండా ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంశాన్ని మొదట ఆ పత్రిక కథనాన్ని అందరూ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు.

 Kcr Aimed At Sharmila  Is It A Bad Time Anymore, Telangana Politics, Cm Kcr, Sha-TeluguStop.com

కాని తరువాత షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే అంశాన్ని మీడియా ద్వారా తెలిపిన తరువాత ఆ పత్రిక కథనానికి బలం చేకూరింది.ఆ తరువాత జిల్లాల నాయకులతో షర్మిల భేటీ కావడం, పార్టీ ఏర్పాటు చేస్తే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే పరిణామాలపై నాయకులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత ఖమ్మం బహిరంగ సభ, నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్ లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆ సమయంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

తెలంగాణలో దొరల పాలన సాగుతున్నదని, ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని విమర్శించడంతో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేయాలని, ప్రజల మద్దతు, నిరుద్యోగుల మద్దతు పొందాలని ప్రయత్నించింది.కాని షర్మిల చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి.

అయితే కేసీఆర్ పై విమర్శలకు టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేసినా వ్యూహాత్మకంగా ఎవరినైనా దెబ్బ కొట్టగలిగే సత్తా ఉన్న కేసీఆర్ షర్మిలపై గురి పెట్టినట్టు తెలుస్తోంది.షర్మిల వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తున్న కేసీఆర్ షర్మిలకు ఏవైతే అనుకూల అంశాలుగా మారుతున్నాయో వాటన్నింటిని షర్మిలకు ప్రతికూలంగా మార్చి షర్మిలను ముందుకెళ్ళ కుండా నిలువరించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube