కెసిఆర్ మంకు పట్టు కేటీఆర్ కు ఇబ్బందులు తెస్తుందా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత మొండివాడో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ వాదించే టైప్.

 Kcr Activity Suffer In Ktr In Telangana-TeluguStop.com

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చూపించిన తెగువ మంకు పట్టు కారణంగానే అంతా అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణం అయ్యింది.తాను ముందుండి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎం గా కేసీఆర్ రికార్డు సృష్టించారు.

మొదటిసారిగా సీఎంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రజల ప్రశంసలు అందుకొన్నాడు.తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఇంటింటికి గోదావరి జలాలను చాలా వరకు అందించి తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నాడు.

ఇక తెలంగాణలో తనకు తిరుగే లేదనే ధీమాతో ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లి తాను అనుకున్న విధంగానే రెండోసారి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు.కానీ రెండో సారి ఇ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో కెసిఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అయ్యింది.

అయితే ఇందులో కెసిఆర్ తప్పు ఉందా లేక అధికారుల తప్పు ఉందా అనే విషయం పక్కన పెడితే జనాల నుంచి మాత్రం బాగా వ్యతిరేకత అయితే పెరిగినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది.

Telugu Huzurnagar, Kcractivity, Kcr Federal, Rtc Strike-Telugu Political News

  తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి కెసిఆర్ చూపంతా జాతీయ రాజకీయాలపై పడింది.ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించారు.చివరికి అది కాస్తా బెడిసికొట్టింది.

తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి తన కుమారుడు కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని కెసిఆర్ ఎన్నో కలలు కన్నాడు.కానీ పరిస్థితులు తారుమారు అవ్వడంతో జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలన్న కెసిఆర్ తన ఆలోచనలను పక్కన పెట్టాడు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ కు కనీసం మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చాడు.అయితే పార్టీ పదవి ఒక్కటే ఉండడం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతుండడంతో ఇటీవలే ఆయనకు గత ప్రభుత్వంలో ఇచ్చిన శాఖలనే మళ్లీ అప్పగించారు.

ఎప్పటికైనా కెసిఆర్ స్థానంలో కూర్చునేది కేటీఆర్ అనే విషయం అందరూ ముందుగా ఊహించిందే.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.దీనికి ప్రధాన ఉదాహరణగా ఆర్టీసీ సమ్మె కనిపిస్తోంది.తాము సమ్మె చేయబోతున్నట్టు నెల రోజుల ముందే నోటీసు ఇచ్చామని కార్మిక సంఘాలు చెబుతుంటే, సమ్మె చట్ట విరుద్ధం అంటూ ప్రభుత్వం వాదిస్తోంది.

మరోవైపు సమ్మెకు దిగిన 48 వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అంటూ కెసిఆర్ ప్రకటించి మరింత వివాదాన్ని రాజేసారు.ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పటికే రెండు వారాలు దాటింది.

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బందు కూడా బాగా సక్సెస్ అయింది.ఇక ఆర్ టి సి కార్మికులతో చర్చలు జరిపి ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

కానీ ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదు.

Telugu Huzurnagar, Kcractivity, Kcr Federal, Rtc Strike-Telugu Political News

  పరిస్థితులు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను కెసిఆర్ ప్రకటిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు తగిన సహాయ సహకారాలు లభించని పరిస్థితి.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించే బదులు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిన తరువాత ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.కేటీఆర్ కూడా రాష్ట్రంలో పరిస్థితులు అన్ని చక్కబడిన తరువాత మాత్రమే ఏదైనా కీలక బాధ్యతలు తీసుకోవాలని అప్పటివరకు సైలెంట్ గానే ఉండాలని చూస్తున్నారట.

అసలు ఈ టాపిక్ ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం కెసిఆర్ తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు వస్తున్న గుసగుసలే కారణం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube