ఆంధ్రా పాలకులని కడిగేసిన కేసీఆర్..మరి నీ సంగతేంది కేసీఆర్...     2018-06-29   05:41:51  IST  Bhanu C

కేసీఆర్ తిక్క రాజకీయాలకి ఇదొక ఉదాహరణ..పెట్టిన చేతినే నరికేసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మరో మారు నిరూపించుకున్నాడు…కేసీఆర్ ఎప్పుడు ఏపీ వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన మంచి చేద్దలని దగ్గర ఉండి మరీ చూసుకునే ఏపీ పాలకులపై నిప్పులు చేరుగారు కేసీఆర్ ఒక పక్క దుర్గగుడికి వచ్చి రాజ లాంచనాలు అన్నీ అందుకుని మరీ దర్జాగా దొరారు తెలంగాణా వెళ్లి మరీ ఏపీ పాలకులని నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుంది..వివరాలలోకి వెళ్తే..

విజయవాడలో అమ్మవారి దర్సనం అయిన తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయిన కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ లో రివ్యూ పెట్టుకున్నారు.అంతకు ముందే విజయవాడలో ఏపీ ప్రజలు పాలకులు ఆయనకీ సాదర స్వాగారం పలకడం అన్ని మర్యాదలు చేయడం అందరూ తిలకించారు ఆయన అనుభూతి కూడా పొందారు అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మరీ కేసీఆర్ ఏపీ పై కస్సు మన్నారు.. మన విలువ మనకు తెలీకుండా ఆంధ్రా పాలకులు దుర్మార్గం చేశారంటూ కొత్త రాగం అందుకున్నారు.

ఉమ్మడి పాలనలో తెలంగాణలో ఉన్న పర్యాటకాన్ని అందరూ విస్మరించారని ఇప్పుడు వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాలికలు రూపొందిస్తున్నట్టుగా తెలిపారు…కామారెడ్డి పట్టణ సమీపంలోని అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్ట బలోపేతంతో పాటు కామారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు..జిల్లా కలెక్టరు.. అధికారులతో కలిసి ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు..ఎన్నో ప్రకృతి రమణీమ దృశ్యాలు మరెన్నోఅద్భుత పుణ్యక్షేత్రాల ఉన్నాయని వలస పాలనలో ఇవన్నీ అంతరించి పోయాయని అన్నారు..కాళేశ్వరం పుణ్యక్షేత్రం మహత్యం ఎక్కడో ఉన్న శృంగేరి పీఠాధిపతికి తెలుస్తుంది కానీ ఆంధ్రా పాలకులకు తెలీలేదా అని ఫైర్ అయ్యారు..విశాలమైన అడవులు , కొండలు ,గుట్టలు , నదీనదాలు సహజసిద్ధ సుందర దృశ్యాలున్న తెలంగాణను అత్యద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు…అయితే మంచిర్యాల పిల్లగాడు దూలం సత్యనారాయణ వచ్చి వీడియోలు తీసి చూపించే వరకూ తెలంగాణలో దాగి ఉన్న ప్రకృతి అద్భుతాలు వెలుగులోకి రాలేదని..ఏపీ పాలకులు ఇవేమీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు..అయితే

కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకి ఇప్పటికే సోషల్ మీడియా మొదలు ఏపీలో ప్రతీ నాయకుడు సైతం కేసీఆర్ కి కౌంటర్ మీద కౌంటర్ వేస్తున్నారు.సరే ఏపీ నాయకులు మర్చిపోయారు మరి గడిచిన నాలుగేళ్ల కాలంలో మీరు ఏమి చేశారు సారూ అంటూ దిమ్మతిరిగే కామెంట్స్ పెడుతున్నారు..తెలంగాణను అత్యద్భుతంగా తన కెమేరాతో బంధించి.. కొత్త ఇమేజ్ తెచ్చిన దూలం సత్యనారాయణ లాంటి పోరగాడి రిపోర్ట్ ఇచ్చేంత వరకూ ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణా గురింఛి నీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఏపీ ప్రజలు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.