కేసీఆర్ సస్పెన్స్ లో పెట్టేస్తున్నాడే..? 10 న ముహూర్తం ఫిక్సేనా ...?  

Kcr About Toor In Andhra Pradesh About Return Gift-kcr,kcr And Ys Jagan,pawan Kalyan Janasena,return Gift,tdp,trs,ycp,ys Jagan

TRS party in Telangana is coming to power in the month ... yet there is no development on cabinet expansion. As long as the KRR expansion is strongly believed, the impatience is growing in the hope. Who will come to the rank of Minister? Which branch comes to? KCR does not breathe in the mouth when the calculations come up. This month the cabinet expansion is going to take place ... many dates have come to prominence. But those dates have changed. But there are certainly reports that there is definitely cabinet expansion on 10th of this month. Because on the tenth day there was a strong forecasts that the KCR has begun campaigning in the TRS party as it looks to expand its cabinet.

.

According to the sentiment of KCR, the earliest ministerial expansion is likely to give six to six. Later in the second installment, KCR is looking to see the social equations and slowly expand the ministerial expansion. Without taking into consideration ... Budget meetings are to be held in the first week of March, KCR is looking to end the Cabinet expansion. TRS government is likely to get 18 ministers as ministers. Currently there are only KCR and Home Minister Mohammed Ali. It is possible that 16 more people will be taken into the cabinet. .

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా… ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎటువంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు. అసలే ముహూర్తాలు సెంటిమెంట్లను బలంగా నమ్మే కేసీఆర్ విస్తరణను ఆలస్యం చేసే కొద్దీ… ఆశావహుల్లో అసహనం పెరిగిపోతోంది. అసలు ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి.? ఎవరికి ఏ శాఖ వస్తుంది..

కేసీఆర్ సస్పెన్స్ లో పెట్టేస్తున్నాడే..? 10 న ముహూర్తం ఫిక్సేనా ...?-KCR About Toor In Andhra Pradesh About Return Gift

? అనే లెక్కలు తెరపైకి వస్తున్న తరుణంలో కేసీఆర్ మాత్రం నోరు మెదపడం లేదు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని… అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ తేదీలు మారిపోయాయి.

కానీ… ఈనెల 10న ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పదో తేదీన బలమైన ముహూర్తం ఉండడంతో కేసీఆర్ తన క్యాబినెట్ ను విస్తరించాలని చూస్తున్నట్టుగా టిఆర్ఎస్ పార్టీలో జోరుగా ప్రచారం స్టార్ట్ అయింది.

కేసీఆర్ కు సెంటిమెంట్ ప్రకారం తొలివిడత మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రెండో విడతలో సామాజిక సమీకరణలు లెక్కలు చూసి నెమ్మదిగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ చూస్తున్నాడట. అదీకాకుండా… మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో కేబినెట్ విస్తరణ ఈ లోపుగానే ముగించేయాలని చూస్తున్నాడు కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 మంది వరకు మంత్రులు గా తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ తో పాటు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మాత్రమే ఉన్నారు.

అంటే ఇంకా 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది..

కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపంలోనే ఉండడంతో… ఎన్నికల తంతు పూర్తి అయిన తరువాత మంత్రివర్గ విస్తరణ చేస్తే అసంతృప్తుల వల్ల పెద్దగా నష్ట పోయేది ఏమీ ఉండదని కేసీఆర్ భావిస్తున్నాడు. అయితే తొలి విడతలో హరీష్ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకి ప్రాధాన్యం దక్కుతుందా లేదా అని చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ కు సంబంధించి ఎన్ని కథనాలు వచ్చినా ఎన్ని చర్చలు జరిగినా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే తన పని తాను చేసుకు పోతున్నాడు. దీంతో అసలు కేసీఆర్ మనసులో ఏముంది.

? అనేది తెలియక నాయకులు సతమతం అయిపోతున్నారు