అప్పుడు అలా..ఇప్పుడు ఇలా..

ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆ ప్రాంత ప్రజాకాంక్షను ఉద్యమంగా మార్చి.అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్.

 Kcr Sensational Comments On Hyderabad Settlers-TeluguStop.com

కాకపోతే.ఆ లక్ష్యం చేరుకునే క్రమంలో ఆయన అనుసరించిన పోకడలు కొందరిని ఇబ్బందికి గురిచేశాయి.

మనసులను బాధపెట్టాయన్న మాట కూడా వాస్తవమే.ప్రత్యేకించి.

పంచుడో దంచుడో.ఆంధ్రావాలా భాగో.

కర్రుకాల్చి వాతపెడతం.వంటి నినాదాలు మాటలతో ఆయన సీమాంధ్రుల్లో అలజడి రేపారు.

ప్రత్యేకించి హైదరాబాద్ లో నివసిస్తున్న సీమాంధ్రులు భయపడిపోయే తరహాలో ప్రకటనలు చేశారు.అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.

సీఎం అయిన తొలిరోజుల్లో కూడా కేసీఆర్ పాత వైఖరినే కొనసాగించారు.కానీ కొన్నిరోజులుగా ఆయన తన వైఖరి మార్చుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని సీమాంధ్రులకు భరోసా ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారు.కూకట్ పల్లికి చెందిన కొందమంది నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు హైదరాబాద్ లో ఉంటున్న సీమాధ్రులకు షాక్ కు గురిచేయక మానవు.

వారిపై ప్రేమ కురిపిస్తూ ఆయన ఎన్నో మాటలు చెప్పారు.హైదరాబాద్ లోని సీమాంధ్రులపై తమకు ఎలాంటి విద్వేషం లేదని.

అసలు ఇక్కడి ఉండేవారంతా హైదరాబాదీలేనని అన్నారు.ఇకపై అసలు సెటిలర్లు అన్నపదమే లేదని తేల్చిచెప్పేశారు.

ఉద్యమ సమయంలో కొన్ని విద్వేష చర్యలు చేసిన మాట వాస్తవమేనన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ.లక్ష్యం సాధించిన తర్వాత.

ఇక అంతా కలిసుందామని పిలుపు ఇచ్చారు.బహుశా దీన్నేనేమో రాజకీయం అంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు