ఆ షోతో కోటీశ్వరుడయ్యాడు.. జల్సాలు చేశాడు.. చివరకు!  

kbc winner sushil kumar says worst time of his life after winning 5 crore rupees, Amithab Bachan, Bihar, Sushil Kumar, kbc, - Telugu Amitabh Bachan, Bihar, Kbc Show, Sushil Kumar

అదృష్టం, దరిద్రం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే.అదృష్టం ఉంటే మనిషి సులువుగా ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతాడు.

TeluguStop.com - Kbc Winner Sushil Kumar Says Worst Time Of His Life After Winning 5 Crore Rupees

అదే వ్యక్తిని దురదృష్టం వెంటాడితే మాత్రం అథః పాతాళానికి పడిపోయాడు.ఈ వ్యక్తి కథ తెలిస్తే మనిషి జీవితంలో అదృష్టం, దురదృష్టం పాత్ర సులభంగానే అర్థమవుతుంది.

అతని పేరు సుశీల్ కుమార్.బీహార్ కు చెందిన సుశీల్ కుమార్ కౌన్ బనేగా కరోడ్ పతి షో ద్వారా ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యాడు.

TeluguStop.com - ఆ షోతో కోటీశ్వరుడయ్యాడు.. జల్సాలు చేశాడు.. చివరకు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఓవర్ నైట్ లో అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.సాధారణ వ్యక్తి అయిన సుశీల్ కుమార్ అమితాబ్ హోస్ట్ చేసిన షో ద్వారా తెచ్చుకున్న గుర్తింపు అంతాఇంతా కాదు.

అయితే అదృష్టం 5 కోట్లు తెచ్చిపెడితే దరిద్రంతో చివరకు రూపాయి కూడా లేని స్థితికి వెళ్లాడు సుశీల్.తొమ్మిదేళ్ల క్రితం సుశీల్ 5 కోట్లు గెలుచుకోగా ఉన్న డబ్బంతా ఖర్చై పోవడంతో చివరకు 18 వేల రూపాయల వేతనానికి ఉద్యోగంలో చేరాడు.

అదృష్టం తెచ్చిపెట్టిన డబ్బును వృథా ఖర్చులకు, జల్సాలకు వినియోగించడంతో షో ద్వారా సంపాదించిన డబ్బులో ఏం మిగలలేదు.షోలో డబ్బు గెలుచుకున్న తర్వాత సుశీల్ జీవితమే మారిపోయింది.

విపరీతమైన పాపులారిటీ రావడంతో ఊహల్లో బ్రతికిన సుశీల్ వాస్తవాన్ని గ్రహించలేకపోయాడు.అదృష్టం తెచ్చిపెట్టిన డబ్బు కావడంతో సుశీల్ ఆ డబ్బును సరైన విధంగా ఖర్చు చేయాలని ఆలోచించలేకపోయాడు.

మరోవైపు సుశీల్ చెడు అలవాట్ల బారిన పడ్డారు.అతని కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు చెప్పి చూసినా సుశీల్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.అదృష్టం తెచ్చిపెట్టిన సంపదను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని సుశీల్ నిరూపించాడు.కొందరు సుశీల్ కథ తెలిసి అయ్యో పాపం అంటుంటే మరి కొందరు మాత్రం సుశీల్ చేసిన తప్పులే ఈ స్థితికి కారణమయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.

#Sushil Kumar #Kbc Show #Amitabh Bachan #Bihar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kbc Winner Sushil Kumar Says Worst Time Of His Life After Winning 5 Crore Rupees Related Telugu News,Photos/Pics,Images..