రంగంలోకి కవిత టీఆర్ఎస్ కు ఊపు వస్తుందా ?

ఎంపీగా ఓటమి చెందిన దగ్గర నుంచి కేసీఆర్ కుమార్తె కవిత జనాలకు ముఖం చూపించలేక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.నిజామాబాద్ ఎన్నికల్లో తాను తప్పక విజయం సాధిస్తానని ధీమాతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెకు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారనే బాధ ఎక్కువగా ఉంది.

 Kavitha Step In Nizamabad Muncipal Elections-TeluguStop.com

దీంతో ఆమె క్రేయాశీలక రాజకీయకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అసలు తాను ఎందుకు ఓటమి చెందాను అనే విషయాన్ని ఆమె రహస్యంగా సర్వే చేయించడంతో పాటు తన సన్నిహితులైన వ్యక్తుల ద్వారా ఆరా తీయగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్యెల్యేలు చాలామంది కవిత ఓటమి కి గట్టిగానే కృషి చేసినట్టుగా తేలడంతో ఆమెకు మరింత బాధను కలిగించిందట.

అందుకే ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.కానీ ఆమె మనసు మాత్రం రాజకీయాలవైపు లాగుతోంది.

ఇక త్వరలో తెలంగాణాలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానానికి కవిత ను కేసీఆర్ ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎంపీ పదవి ఆమెకు వచ్చిన తరువాత రాజకీయంగా యాక్టివ్ అవుతారని అంతా భావిస్తుండగా ఆమె మాత్రం ఏదో ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రజల్లో కాస్త పలుకుబడి పెంచుకోవాలని కవిత చూస్తున్నారు.

Telugu Kavitha, Kavithastep, Kavithatumric, Kavithaactive, Nizamabadformar-

ప్రస్తుతం తెలంగాణాలో కొంతకాలంగా పసుపు రైతులు తీవ్ర స్థాయిలో మద్దతు ధర కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు.అప్పట్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి సంజయ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.కానీ ఆయన ఎంపీగా గెలిచినా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆ హామీని ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో రైతులంతా ఆగ్రహంగా ఉండడంతో పాటు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో పసుపు రైతులకు అండగా నిలబడి వారికి మద్దతుగా పాదయాత్ర చేయలని చూస్తున్నారట.

ఇలా చేయడం ద్వారా తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి బీజేపీని దెబ్బతీయడంతో పాటు రాజకీయంగా తనకు మంచి ఊపు వస్తుందని కవిత భావిస్తున్నారు.అయితే ఈ పరిణామాలు పార్టీలోని కొంతఘామందికి మింగుడుపడడంలేదు.

కవిత పొలిటికల్ గా యాక్టివ్ అయితే తమకు ఇబ్బంది అన్నట్టుగా పార్టీలోని కొంతమంది ఉన్నారు.

Telugu Kavitha, Kavithastep, Kavithatumric, Kavithaactive, Nizamabadformar-

ఇక తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవుతుండడంతో నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల్లో తన మార్క్ ప్రచారంతో గులాబీ జెండా ఎగురేస్తారనే ధీమాలో పార్టీ అధిష్ఠానం ఉంటే, ఆమె వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆమె అనుచరులు ఎదురుచూస్తున్నారట.కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం, తామే ఆ బాధ్యతలు చూస్తామని అనుచరుల వద్ద చెబుతున్నారట.మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఎట్టి పరిస్ధితుల్లోనూ కవిత తీసుకోరని కొంతమంది చెబుతుండగా కవిత రాక కోసం ఎదురుచూస్తున్న నేతలు, కార్యకర్తలు మాత్రం ఆలస్యం జరిగినా రావడం పక్కా అంటుండటం, అందుకు అనుగుణంగా కవిత మళ్ళీ యాక్టివ్ కావడంతో కొందరిలో బాధ, భయం కొందరిలో ఆనందం ఎక్కువగా ఉందట.

మళ్ళీ పాత రోజులు వస్తాయని కొందరు ఖుషిగా ఉంటే మరికొందరు మాత్రం ఆ పాత రోజులతో తమ ప్రాధాన్యం తగ్గుతుందని దిగులు పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube