నిజామాబాద్ నియోజక వర్గంలో కవిత వెనుకంజ  

Kavitha Is Back In The Nizamabad Constituency-kavitha,nizamabad,telangana,trs,నిజామాబాద్‌,వైసీపీ పార్టీ

ఒకపక్క ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆధిక్యం లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క తెలంగాణ లోని లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యం లో ఉంది. అయితే నిజామాబాద్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందజంలో కొనసాగుతుండగా, ఇదే చోట టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన కవిత వెనుకంజ లో ఉన్నట్లు తెలుస్తుంది..

నిజామాబాద్ నియోజక వర్గంలో కవిత వెనుకంజ-Kavitha Is Back In The Nizamabad Constituency

నిజామాబాద్ లోక్ సభ స్థానము కి సంబంధించి బీజేపీకి 18,280 ఓట్లు ఆధిక్యం లభించింది.

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ తెరాస అభ్యర్థి కవిత వెనుకంజలో కొనసాగుతుండటం తో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడి నుంచి 160 మందికిపైగా రైతులు పోటీలో నిలవడంతో ఈ ఎన్నిక నిర్వహణ ఈసీకి సవాల్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అ యితే ఈ ఫలితాల పై కవిత స్పందిస్తూ రైతులు పోటీ లో నిలవడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే నని అక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.