కేటీఆర్ కు సీఎం ! కవితకు హరీష్ కు ఈ పదవులా ?   

kavitha hareesh rao posts disided by kcrKavitha, - kcr,-Telangana, trs -ts poltics-ktr-kavitha-cm candiadte-nigamabad mlc-bjp-central poltics-harish rao - Telugu Cm Post, Hareesh Rao, Kavitha, Kcr, Munsipal Minister, Nijamabad Mlc, Telangana, Trs, Trs Working President

త్వరలోనే తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు మంత్రి కేటీఆర్.ఎప్పటి నుంచో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

TeluguStop.com - Kavitha Hareesh Rao Posts Disided By Kcr

అందుకే కేటీఆర్ కు తెలంగాణ సీఎం బాధ్యతలు అప్పగించి తాను పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావించారు.అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బాగా బల పడుతున్న తరుణంలో, కేంద్రంలో మరుతున్న రాజకీయ   సమీకరణాల నేపథ్యంలో ఇక జాతీయ రాజకీయాలపై కాకుండా, తెలంగాణ రాజకీయాలు పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయానికి కెసిఆర్ వచ్చారు.

ఆ నిర్ణయం మేరకు అతి త్వరలో కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టెందుకు ప్లాన్ చేశారు.

TeluguStop.com - కేటీఆర్ కు సీఎం కవితకు హరీష్ కు ఈ పదవులా  -Political-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే మొదటి నుంచి టిఆర్ఎస్ ను బలోపేతం చేస్తూ,  పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తూ వస్తున్న మంత్రి హరీష్ రావు పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.కేటీఆర్ కు సీఎం పదవి ఇవ్వనున్న నేపథ్యంలో, హరీష్ రావుకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే ప్రచారం ఇప్పుడు పార్టీలో ఊపందుకుంది.టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా హరీష్ రావు కు పేరు ఉంది.

తెలంగాణలో సీఎం కేసీఆర్ కు ఎంత పట్టు ఉందో అంతే స్థాయిలో హరీష్ రావుకు పట్టు ఉండడంతో ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తేనే బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలము అనే అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నారట.ఇక కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదవి విషయమూ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.

నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేసి ఓటమి చెందిన కవిత రాజకీయంగా సైలెంట్ గానే ఉండిపోయారు.పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడేవారు కాదు.

ఆమెను మళ్ళీ పూర్తిగా యాక్టివ్ చేసేందుకు కేసీఆర్ ఆమెనుు నిజామాబాాద స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా  నిలబెట్టి గెలిపించారు.అప్పటి నుంచి ఆమెకు మంత్రి పదవి రాబోతోందనే చర్చ నడుస్తూ వచ్చింది.

ఇప్పుడు కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే మంత్రిమండలి తప్పనిసరిగా ప్రక్షాళన చేసి పూర్తిగా తన టీమ్ ను కేటీఆర్ నియమించుకునే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం కేటీఆర్ నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖ ను ఆమెకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

.

#TRSWorking #Kavitha #CM Post #Telangana #Nijamabad Mlc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు